Advertisementt

ట్రోల్స్ కి భయపడిన డైరెక్టర్

Sun 05th May 2024 11:28 AM
anil ravipudi  ట్రోల్స్ కి భయపడిన డైరెక్టర్
A director who is afraid of trolls ట్రోల్స్ కి భయపడిన డైరెక్టర్
Advertisement
Ads by CJ

ముందు సినిమాలు చూడండి.. ఐపీఎల్ స్కోర్ ఫోన్ లో అయినా చూసుకోవచ్చంటూ ఈమధ్యన కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన దర్శకుడు అనిల్ రావిపూడిని క్రికెట్ లవర్స్ సోషల్ మీడియాలో ఏసుకుంటున్నారు అనిల్ రావిపూడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. సినిమాలు చూడాలంటే డబ్బులు పెట్టాలి.. కానీ క్రికెట్ ను ఫ్రీగా ఇంట్లో చూడొచ్చు.. అంటూ అనిల్ ని తెగ ట్రోల్ చేశారు. 

తాజాగా ఆ ట్రోల్స్ పై డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. దాస‌రి నారాయణరావు జ‌యంతి వేడుక‌ల్లో అనిల్ రావిపూడి పాల్గొన్నారు. 

ఈమధ్యన IPL కోసం మాట్లాడాను. స్వతహాగా క్రికెట్ ఫ్యాన్ అయిన నేను.. అందరికన్నా ఎక్కువగా హర్ట్ అయ్యాను. కృష్ణమ్మ ఈవెంట్ కు వెళ్లేముందు అనుకోకుండా నేను ఓ డిస్ట్రిబ్యూటర్ ను కలిశాను. వేసవి సెలవల్లో సినిమాలకు ఎవరూ రావడం లేదు. థియేటర్స్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి అని ఆయన చెప్పడంతో నేను అదే మైండ్ సెట్ తో ఆ ఈవెంట్ కి వచ్చి అదే ఫ్లోలో అలా మాట్లాడాను

తాను క్రికెట్ మీద అయిష్టం తో స్కోరు ని ఫోన్ లో చూసుకోమనలేదు.. ముందు క్రికెట్ ని వీక్షించండి, ఆ తర్వాతే టైమ్ ఉంటే సినిమాలు చూసి ఎంకరేజ్ చెయ్యండి అంటూ వివరణ ఇచ్చాడు. 

A director who is afraid of trolls:

Anil Ravipudi Clarity About IPL Trolls

Tags:   ANIL RAVIPUDI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ