Advertisementt

రౌడీ స్టార్ నుంచి ఇంకా బోలెడు సర్ ప్రైజ్ లు

Sun 05th May 2024 09:54 AM
vijay devarakonda  రౌడీ స్టార్ నుంచి ఇంకా బోలెడు సర్ ప్రైజ్ లు
Many more surprises from the Rowdy star రౌడీ స్టార్ నుంచి ఇంకా బోలెడు సర్ ప్రైజ్ లు
Advertisement
Ads by CJ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని ఫ్యామిలీ స్టార్ డిస్పాయింట్ చేసినా.. దాని ఎఫెక్ట్ ఏమి అతని పై పడలేదు అనిపించేలా అతను అనౌన్స్ చేస్తున్న ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ డీసెంట్ గా ఉన్నా సోషల్ మీడియా నెగిటివిటీ వలన ఆ సినిమా ఆడలేదు. అయినప్పటికీ దిల్ రాజు విజయ్ దేవరకొండ తో మరో మూవీ అనౌన్స్ చేసాడు. ర‌వికిర‌ణ్ కోలా దర్శకత్వంలో విజయ్-దిల్ రాజు మూవీ ఉండబోతుంది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న VD 12 టైటిల్ మే 9 అంటే విజయ్ దేవరకొండ బర్త్ డే కి రాబోతుంది. అంతేకాదు.. ఈసారి విజయ్ దేవరకొండ బర్త్ డే కి బోలెడన్ని సర్ ప్రైజ్ లు ఉండబోతున్నట్టుగా టాక్ ఉంది. అందులో రవికిరణ్ కోలా-విజయ్ దేవరకొండ కాంబో మూవీకి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ని మే 9 నే అనౌన్స్ చేస్తారట.

రౌడీ జ‌నార్థ‌న్ విలేజ్ యాక్ష‌న్ డ్రామాగా ఉండబోతుంది. వీటితో పాటుగా తనకి టాక్సీ వాలా చిత్రంతో హిట్ ఇచ్చిన రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమాకి కమిట్ అవ్వడమే కాదు ఆ కాంబో కూడా మే 9 నే అనౌన్సమెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇన్ని సినిమాల అప్ డేట్స్ తో విజయ్ బర్త్ డే కళకళలాడబోతుంది. దీనిని బట్టి ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ విజయ్ పై ఎంత మాత్రమూ పడలేదు అనిపిస్తుంది. 

Many more surprises from the Rowdy star:

More surprises from the Vijay Devarakonda birthday

Tags:   VIJAY DEVARAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ