Advertisementt

ఎన్టీఆర్ ఫాన్స్ ని వేడుకుంటున్న కొడాలి నాని

Sat 04th May 2024 06:08 PM
kodali nani  ఎన్టీఆర్ ఫాన్స్ ని వేడుకుంటున్న కొడాలి నాని
Kodali Nani begging NTR fans ఎన్టీఆర్ ఫాన్స్ ని వేడుకుంటున్న కొడాలి నాని
Advertisement
Ads by CJ

బూతు ఎమ్యెల్యేగా, బూతు మంత్రిగా ఏపీ ప్రజల్లో బాగా హైలెట్ అయిన కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుందా.. అంటే అవునేమో.. నిజమేనేమో అనేట్టుగా ఉంది.. కొడాలి నాని ప్రస్తుత పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ పుణ్యమా అని ఎమ్యెల్యేగా టికెట్ దక్కించుకుని రెండుసార్లు టీడీపీ నుంచి గెలుపొంది, తర్వాత వైసీపీ లో చేరి చంద్రబాబు, లోకేష్ లని తిట్టడమే పనిగా పెట్టుకున్న కొడాలి నానికి ఇప్పుడు గుడివాలో ఎదురు గాలి వీస్తున్నట్టుగా కనిపిస్తుంది. 

అందుకే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి గాలం వేస్తున్నాడు. ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు వచ్చేవరకు టీడీపీ కి ఓటెయ్యద్దని చెబుతున్నాడు. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వేమవరంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కొడాలి నాని.. మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై నోరు పారేసుకుంటూ ఎన్టీఆర్ ని పోగిడేసాడు. 

ఈ ఎన్నికల్లో టీడీపీ ని ఓడిస్తేనే జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుంది, నాకు సీనియర్ ఎన్టీఆర్, వైఎస్సార్‌ రెండు కళ్లని, నందమూరి హరికృష్ణ తనకు గురువని చెప్పిన కొడాలి నాని జూనియర్‌ ఎన్టీఆర్‌ ను టీడీపీలో చంద్రబాబు, లోకేష్ లు అణగదొక్కుతున్నారని.. ఎన్టీఆర్ ఫాన్స్ పై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించాడు. 

ఈ దాడుల వెనుక చంద్రబాబు, లోకేశ్‌ ఉన్నారు కాబట్టే వారు ఆ దాడుల్ని ఖండించడం లేదని, అసలు చంద్రబాబు, లోకేష్ లని టీడీపీ ని ఈ ఎన్నికల్లో నామ రూపాల్లేకుండా చేస్తేనే జూనియర్ ఎన్టీఆర్ కి గౌరవం దక్కుతుంది, అంతేకాకుండా ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు వస్తాయి. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులెవరూ టీడీపీ కి ఓటెయ్యొద్దు, టీడీపీ ఎన్టీఆర్ చేతికి వచ్చాకే ఓటెయ్యండి అంటూ వేడుకున్నాడు. 

Kodali Nani begging NTR fans:

Kodali Nani Comments On Chandrababu And Jr.NTR In Gudivada

Tags:   KODALI NANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ