Advertisementt

ఇండియన్ 2 వాయిదా పడుతుందా?

Sat 04th May 2024 04:47 PM
indian 2  ఇండియన్ 2 వాయిదా పడుతుందా?
Indian 2 release date getting changed? ఇండియన్ 2 వాయిదా పడుతుందా?
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ - శంకర్ కలయికలో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గా భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఇండియన్2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోవడంతో.. జూన్ లో ఇండియన్ 2 ని విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే జూన్ లో ఏ తేదీ అని మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. ఇండియన్ 2 రిలీజ్ జూన్ 13 న అని కొందరు, జూన్ 15 అని కొందరు చెబుతున్నారు. 

ప్రస్తుతం శంకర్ కూడా ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నారు. ఈలోపులో ఇండియన్ 2 జూన్ లో విడుదల కాబోవడం లేదు. అందుకే మేకర్స్ డేట్ కూడా ఇవ్వలేదు, ఇండియన్ 2 జూన్ నుంచి జులై కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ #Indian2 హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. అందుకే ఇంకా ఖచ్చితమైన డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు జూన్ కాదు జులై అంటూ తేదీని త్వరలోనే మేకర్స్ ఎనౌన్స్ చేస్తారంటున్నారు. 

మరి సోషల్ మీడియా టాక్ ప్రకారం ఇండియన్ 2 చిత్రం వాయిదా పడుతుందా.. అసలు ఈ విషయంలో మేకర్స్ ఏం చెబుతారో అని కమల్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. లేదంటే మేకర్స్ ఈ రూమార్స్ కొట్టిపారేస్తూ ఇండియన్ 2 జూన్ లో రిలీజ్ డేట్ ని లాక్ చేస్తారేమో చూద్దాం. 

Indian 2 release date getting changed?:

Changes galore in Indian 2 release date

Tags:   INDIAN 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ