Advertisementt

క్రిమినల్ కేసులో ఇరుక్కున్న బండ్ల గణేష్

Sat 04th May 2024 12:46 PM
bandla ganesh  క్రిమినల్ కేసులో ఇరుక్కున్న బండ్ల గణేష్
Criminal Case against Bandla Ganesh క్రిమినల్ కేసులో ఇరుక్కున్న బండ్ల గణేష్
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా నిర్మాత బండ్ల గణేష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాక్టీవ్ గా మారిన బండ్ల గణేష్ అంతే యాక్టీవ్ గా కేసుల్లో ఇరుక్కుంటున్నాడు. ఫిలింనగర్ లో హీరా గ్రూపు సీఈవో నౌహీరా షేక్ కు చెందిన రూ. 75కోట్ల విలువైన ఇల్లు కబ్జా చేసినట్లు గణేష్ పై గతంలో ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. 

అప్పుడు పోలీసులు బండ్ల గణేష్ పై యాక్షన్ తీసుకోకపోగా.. నౌహీరా షేక్ మీదనే తిరిగి కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై నౌహీరా షేక్ తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేసింది. బండ్ల గణేశ్ కు నెలకు రూ.లక్ష అద్దె చొప్పున నౌహీరా షేక్ ఫిలింనగర్ లోని తన ఇంటిని కిరాయికి ఇచ్చారు. కానీ గణేష్ కొంతకాలంగా అద్దె చెల్లించకపోగా.. గూండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి రానివ్వకుండా గణేష్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ కేసుపై పోలీస్ లు యాక్షన్ తీసుకోకపోవడంతో నౌహీరా పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో ఫిల్మ్‌ నగర్‌ పోలీసులు ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో ఇరుక్కున్న బండ్ల గణేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Criminal Case against Bandla Ganesh:

Bandla Ganesh lands in trouble

Tags:   BANDLA GANESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ