Advertisementt

OG డేట్ పై కన్నేసిన రామ్ చరణ్

Sat 04th May 2024 10:36 AM
ram charan  OG డేట్ పై కన్నేసిన రామ్ చరణ్
Ram Charan eyed on the OG Movie date OG డేట్ పై కన్నేసిన రామ్ చరణ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం గేమ్ చెంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు లాక్ చేస్తారా అని మెగా ఫాన్స్ కొంతకాలంగా ఎదురు చూడని రోజు లేదు. సినిమా షూటింగ్ మొదలై రెండేళ్లు దాటేసింది. అయినా శంకర్ రిలీజ్ డేట్ ఇవ్వకుండా పరీక్షపెడుతున్నారు. రామ్ చరణ్ మూడు రోజుల చెన్నై షూటింగ్ కంప్లీట్ చేసేసి హైదరాబాద్ వచ్చేసాడు. 

అయితే సెప్టెంబర్ కానీ అక్టోబర్ లో కానీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వుండొచ్చనే మాట దిల్ రాజు, రామ్ చరణ్ ఇద్దరూ చెప్పడంతో ఆ నెలల్లోనే గేమ్ ఛేంజర్ విడుదలపై మెగా అభిమానులు ఆశలు పెంచుకుంటున్నారు. అక్టోబర్ లో ఎన్టీఆర్ దేవరతో రాబోతున్నాడు. అలాగే మరికొన్ని పెద్ద సినిమాలు కూడా దసరాపై కచ్చిఫ్ వేసాయి. 

అయితే సెప్టెంబర్ 27 న పవన్ కళ్యాణ్-సుజిత్ కలయికలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న OG విడుదల అని మేకర్స్ ఎప్పుడో అనౌన్సమెంట్ ఇచ్చేసారు. ఈమధ్యన OG డేట్ మారొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. దానితో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఆ తేదీలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని శంకర్-దిల్ రాజు ఆలోచిస్తున్నట్లుగా టాక్. మరి OG తప్పుకుంటే ఆ డేట్ కి చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు. 

Ram Charan eyed on the OG Movie date:

Ram Charan Game Changer eyeing Pawan Kalyan OG?

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ