Advertisementt

ఇదీ.. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్!!

Sat 04th May 2024 09:57 AM
revanth reddy  ఇదీ.. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్!!
This is Revanth Reddy brand image!! ఇదీ.. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్!!
Advertisement

ఇదీ.. ఇదే సార్.. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్!!

బుడ్డోడు.. బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా అనే డైలాగ్ గుర్తుంది కదా..!. ఇదే డైలాగ్ రియల్‌ లైఫ్‌లో తెలంగాణ రాజకీయ నేతల నోట ఎన్నిసార్లు వచ్చిందో లెక్కే ఉండదు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒకటా రెండా ఎన్నో పేర్లు.. రవ్వంత రెడ్డి.. రేటెంత రెడ్డి.. హైటెంత రెడ్డి ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు పిలిచారు. ఎక్కడపడితే అక్కడే అరెస్టులు.. ఆఖరికి బెడ్రూమ్ బద్ధలు కొట్టి మరీ పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి. సీన్ కట్ చేస్తే తెలంగాణ కాంగ్రెస్ ఆయన చేతుల్లోకి రావడం.. అహర్నిశలు కష్టపడి అంతా తానై పార్టీని ఒంటి చేత్తో గెలిపించి.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. హస్తం పార్టీ అంటేనే హస్తవ్యస్థం అనే పరిస్థితి నుంచి.. సరైనోడు చేతికి పగ్గాలొస్తే ఇలాగే ఉటుందని ఒకే ఒక్కడు రేవంత్ నిరూపించి చూపించారు.

లోకల్ టూ నేషనల్!

కర్ణాటక ఎన్నికలతో ఎన్నికలతో పుంజుకున్న కాంగ్రెస్.. తెలంగాణలో తన చరీష్మా జతచేసి ఒక్కడై రాష్ట్రమంతా తిరిగారు. ఎక్కడ చూసినా రేవంతుడే అన్నట్లుగా ఏ సభలో చూసినా.. ఏ అభ్యర్థి తరఫున ప్రచారంలో చూసినా ఈయనే కనిపించారు. రాత్రి లేదు.. పగలు లేదు.. అలా కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారు. పదుల సంఖ్యలో రెడ్లు, ఇతర సామాజిక వర్గం వారు.. సీనియర్లు, జూనియర్లు సీఎం సీటుకోసం రచ్చ రచ్చ చేసినా ఆఖరికి అగో ఇప్పటి ప్రతిపక్షాలు తిట్టిన రవ్వంత రెడ్డే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఆ తర్వాత నుంచి తెలంగాణలో పాలన ఎలా సాగుతోందో మనందరికీ తెలిసిందే. ఇక.. రేవంత్ దూకుడు, టాలెంట్, వాక్చాతుర్యం.. నాయకత్వ లక్షణాలు గుర్తించిన హైకమాండ్ ఎక్కడ ఎన్నికలున్నా సరే.. ఆయన అక్కడ ఉండాల్సిందేనని చెబుతోంది. అంటే.. రేవంత్ రావాల్సిందే.. ఎన్నికలు ప్రచారం చేయాల్సిందేనన్న మాట. లోకల్ లీడర్ కాస్త నేషనల్ లీడర్ అయ్యారని కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ వీరాభిమానులు చెప్పుకుంటున్నారు.

రావాల్సిందే..!

తెలంగాణతో పాటు చుట్టు పక్కనున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రేవంత్‌ను స్టార్ క్యాంపెయినర్‌ కంటే ఎక్కువగా హైకమాండ్ భావిస్తూ ప్రచారానికి పంపుతోంది. ఇప్పటికే ఏపీ, కర్ణాటకను చుట్టేసిన రేవంత్.. త్వరలోనే మరికొన్ని భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇటు తెలంగాణ.. అటు నేషనల్ లెవల్‌లో రేవంత్ క్రేజ్ ఎలా ఉందనేది చూశారుగా..!. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు అయితే రేవంత్ రావాల్సిందే.. ప్రచారం చేయాల్సిందే.. ప్రసంగం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ అధిష్టానానికి చెప్పి మరీ పిలిపించుకుంటున్నారంటే.. రేవంత్ అతి తక్కువ సమయంలోనే.. అది కూడా కాంగ్రెస్‌లో ఎంత బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

రేవంతే ఎందుకు..?

వాస్తవానికి రేవంత్ స్పీచ్.. క్లాస్‌గా మొదలై మాస్ జనాన్ని కూడా ఉర్రూతలూగించి.. గూస్‌బమ్స్ వచ్చేలా చేస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. కార్యకర్తలు, అభిమానుల నుంచి వచ్చే రెస్పాన్స్‌తో అంతకు డబుల్ ఉత్సాహంతో రేవంత్ మాట్లాడేస్తుంటారు. సరిగ్గా ఇదే కాంగ్రెస్‌ గ్రాఫ్‌ను ఎక్కడ్నుంచో.. ఇంకెక్కడికో తీసుకెళ్లిందట. తెలంగాణ మొదలుకుని జాతీయ స్థాయిలో రేవంత్ హాట్ టాపిక్ అవ్వడంతో పాటు పార్టీ గ్రాఫ్‌ను విపరీతంగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే చర్చ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య రిజర్వేషన్లపై బీజేపీకి ఓ రేంజ్‌లో కౌంటర్లు.. బీజేపీ పెద్ద తలకాయలైన మోదీ, అమిత్ షాలను సైతం ఏకిపారేస్తుండటం రేవంత్‌కు మరింత ప్లస్ అయ్యింది. దీనికి తోడు ఈయనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంతో జాతీయ మీడియాలో పేరు మార్మోగింది. బీజేపీ బండారం మొత్తం బయటపెడతానని చెప్పడం..  రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తున్నారో కూడా బట్టబయలు చేస్తానని ప్రకటించడంతో ఎటు చూసినా.. ఎవరి నోట విన్నా రేవంత్.. రేవంత్ అనే పేరే వినపడుతోంది. దీంతో కాంగ్రెస్‌ హైకమాండ్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యి.. రేవంత్‌కు ఫుల్ సపోర్టు ఇవ్వడంతో పాటు మంచి బూస్టింగ్ ఇస్తోందట. ఇక అభిమానులు అయితే.. ఇదీ ఇదే సార్ రేవంత్ రెడ్డి అంటుంటే.. మరికొందరు రేవంత్ సింగిల్ పీస్.. ఇలానే ఉంటారని మరికొందరు అనుచరులు చెప్పుకుంటున్న పరిస్థితి.

This is Revanth Reddy brand image!!:

Revanth Reddy: Local to National!

Tags:   REVANTH REDDY
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement