గత రెండు నెలల్లో మలయాళంలో చిన్న సినిమాలుగా ఆడియన్స్ ముందుకు వచ్చి 100, రెండొందలు కోట్లు కొల్లగొట్టిన సినిమాలని తెలుగు నిర్మాతలు హడావిడిగా డబ్ చేసి క్యాష్ చేసుకున్నారు. అందులో ముఖ్యంగా భ్రమయుగం, ప్రేమలు, మంజుమెల్ బాయ్స్ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు మలయాళంలో 20 కోట్లు లోపే తెరకెక్కి 100నుంచి 200 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టాయి.
ఆ తర్వాత పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ నటించిన ఆవేశం కూడా మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. 100 కోట్లు మార్క్ ని టచ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచిన ఆవేశం చిత్రాన్ని తెలుగు నిర్మాతలెవరు పట్టించుకోలేదు లేదంటే ఈపాటికి డబ్ అయ్యి అది తెలుగులో విడుదలయ్యేది కూడా. కానీ ఎవ్వరూ ఆ చిత్రాన్ని పట్టించుకోలేదు.
ఇప్పుడు ఆ ఆవేశం చిత్రాన్ని తెలుగులో డబ్ చెయ్యకుండానే ఓటీటీలో విడుదల చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్యాంగ్ స్టర్ రంగ గా ఫాహద్ నటనకు మలయాళీలు బ్రహ్మరధం పట్టారు. 100కోట్లు కొల్లగొట్టిన ఈచిత్ర డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.
మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఆవేశం చిత్రాన్ని స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తోది. అది కూడా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని అమెజాన్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా టాక్ ఉంది.