ఏ స్టార్ హీరో అభిమానులైనా తమ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఎంత ఎగ్జైట్ అవుతారో.. అదే హీరోలు కొత్త కాంబినేషన్ లో సినిమాలు పూజా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నారు అంటే అంతే ఎగ్జైట్ అవుతూ ఉంటారు. ఈ ఏడాది ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ చిత్రాలు ప్రేక్షకుల అందునా అభిమానుల ముందుకు వస్తున్నారు.
కేవలం సినిమాలని విడుదల చేస్తూనే అభిమానులని అలరించడం లేదు.. కొత్త సినిమా పూజ కార్యక్రమాలతో అభిమానులని మరింత సర్ ప్రైజ్ చెయ్యబోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కొత్త సినిమా RC 16 మొదలైంది. మెగా ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ వార్ 2 అంటూ నార్త్ లోకి క్రేజీ గా కొత్త కాంబోతో ఎంటర్ అవ్వబోతున్నాడు.
ఇక ఇదే ఏడాది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో NTR 31 మొదలు పెట్టేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రేజి పాన్ ఇండియా ఫిలిం ఈ ఎడాది మొదలు కాబోతుంది. అది పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ ల చిత్రం ఈ ఏడాది ఆగష్టు కానీ లేదంటే సెప్టెంబర్ లో కానీ మొదలు అవ్వబోతుంది. దానితో సూపర్ స్టార్ ఫాన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఫుల్ ఖుషి అవుతారు.
ఇక మరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా మరో రెండు నెలల్లో హను రాఘవపూడి మూవీ మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. అంతే కాదు ఆయన సందీప్ వంగ తో కలిసి స్పిరిట్ మూవీని కూడా ఇదే ఏడాది పట్టాలెక్కించి ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 తో ఆగస్టు లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆయన తదుపరి మూవీ ని ఎవరితో అంటే ఏ డైరెక్టర్ తో మొదలు పెడతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రాలన్నీ అభిమానులకి సంతోషాన్నిచ్చే అంశాలే కదా.!