సిద్దు జొన్నగడ్ద కాదు ఇప్పుడు టిల్లు గా సిద్దు పేరు సినిమా ఇండస్ట్రీ లో నిలిచిపోయేలా టిల్లు సీరీస్ తో హిట్స్ కొడుతున్నాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు దానికి సీక్వెల్ గా టిల్లు క్యూబ్ ని కూడా అనౌన్స్ చేసాడు. టిల్లు హిట్స్ లో మేజర్ పార్ట్ హీరో కమ్ రైటర్ అయిన సిద్ధుదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే డీజే టిల్లు లో రాధికగా కీలక పాత్ర అంటే బోల్డ్ కేరెక్టర్ లో చెలరేగిపోయిన నేహా శెట్టి.. టిల్లు స్క్వేర్ లోనూ కొద్ధి క్షణాలు కనిపించి కనువిందు చేసింది. సిద్దు తో రొమాన్స్ విషయంలో నేహా శెట్టి ఎక్కడా తగ్గలేదు. ఇక టిల్లు స్క్వేర్ లో లిల్లీ గా అనుపమ పరమేశ్వరన్ నేహా శెట్టి కన్నా ఎక్కువ రెచ్చిపోయి సిద్ధుతో రొమాన్స్ చేసింది.
అనుపమ కొత్తగా కట్టిన బోల్డ్ కేరెక్టర్ కి ప్రేక్షకులే ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు టిల్లు క్యూబ్ లో సిద్దు తో రొమాన్స్ చెయ్యబోయే హీరోయిన్ పై ఇప్పుడు అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ మొదలైంది. అయితే టిల్లు క్యూబ్ లో సిద్ధుతో రొమాన్స్ చేయబోయేది బుట్టబొమ్మ పూజ హెగ్డే అంటున్నారు. ప్రస్తుతం సౌత్ కెరీర్ లో కాస్త డల్ గా కనిపిస్తున్న పూజ హెగ్డే టిల్లు క్యూబ్ లో సిద్దు తో రొమాన్స్ చేసేందుకు సై అంది అంటున్నారు.
గ్లామర్ విషయంలో పూజ హెగ్డేకి ఎవరూ రారి సాటి అన్నట్టుగా ఉంటుంది. ఇక సిద్దు తో కలిసి అమ్మడు రొమాన్స్ లో ఎలా చెలరేగిపోతుందో చూడాలి.