అల్లరి సినిమాతో కామెడీ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి న నరేష్ అదే అల్లరి చిత్రాన్ని తన ఇంటి పేరుగా మార్చుకుని వరసగా ఎంటెర్టైనెంట్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. అయితే అల్లరోడికి కామెడీ ఎంటెర్టైన్మెట్ ఎంతగా హిట్ అందించాయో.. ఆ తర్వాత అంతగా ఆసినిమాలు నిరాశపరిచాయి. ఇక విజయ్ కనకమేడలతో నాంది అంటూ సీరియస్ నెస్ ఉన్న పాత్రలో అదరగొట్టడమే కాదు.. అవకాశమొస్తే స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ కేరెక్టర్ కి సై అన్నాడు.
నాంది తర్వాత ఒకటి రెండు యాక్షన్ చిత్రాలు చేసినా అవి అల్లరి నరేష్ కి అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే తిరిగి తన జోనర్ లోకి వచ్చేసాడు. ఆ ఒక్కటి అడక్కు అంటూ రాజేంద్ర ప్రసాద్ హిట్ సినిమా టైటిల్ తో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రాన్ని అల్లరి నరేష్ భారీ గా ప్రమోట్ చేసాడు. మరి నేడు ఆడియన్స్ అల్లరోడికి ఎలాంటి తీర్పు ఇస్తారో అని నరేష్ తో పాటుగా అందరూ ఎదురు చూస్తున్నారు, మరికాసేపట్లో ఆ ఒక్కటి అడక్కు రివ్యూస్ వస్తే అల్లరోడు గట్టెక్కాడో.. లేదో తేలిపోతుంది.