సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కుబేర చిత్రంపై అంచనాలు పెంచుతూ మేకర్స్ అప్ డేట్స్ వదులుతున్నారు. ధనుష్ కుబేర ఫస్ట్ లుక్ ఆయన అభిమానులనే కాదు మూవీ లవర్స్ అందరిని తెగ ఇంప్రెస్స్ చేసింది. కొంతమంది కుబేర ఫస్ట్ లుక్ చూడగానే ష్యుర్ షాట్ హిట్ రాసిపెట్టుకోండి అంటూ ఛాలెంజ్ కూడా చేసారు.
ఇక గత రెండు రోజులుగా కుబేర చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్ పై నడుస్తున్న సస్పెన్స్ కి మేకర్స్ తెర దించుతూ ఈ రోజు గురువారం సాయంత్రం కుబేరలో నాగ్ లుక్ ని పరిచయం చేసారు. వర్షంలో గొడుగు పట్టుకుని కళ్లద్దాలు పెట్టుకుని నడుచుకుంటూ వెళుతున్న నాగార్జున రోడ్ పై డబ్బుని చూస్తూ ఉంటాడు.. రోడ్డు పై ఉన్న నోటు పై అడుగువేయబోయి ఆగిపోతాడు. ఆ పక్కనే ఉన్న మరో కంటైనర్‌లోనూ డబ్బు ఉండగా.. తన పర్సులోంచి కొంత డబ్బును తీసి దానిలో వేస్తాడు. కళ్లద్దాలు పెట్టుకుని గడ్డంతో ఉన్న నాగార్జున లుక్ అదిరిపోయింది అనే చెప్పాలి.
ఆయన ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని టాక్ ఉంది. మరి ఇప్పుడు గొడుగు తీసుకుని నాగ్ ఏం కనిపెట్టడానికి వర్షంలో తిరుగుతూన్నారో అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తుంటే.. నాగ్ లుక్ కూల్ గా కనిపించినా ఆయన కేరెక్టర్లో లోతు మాత్రం అర్ధం కానట్టుగా అనిపించింది. ఇక ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా కనిపించబోతుంది.