Advertisementt

SSMB29 పై నిర్మాత హాట్ కామెంట్స్

Thu 02nd May 2024 04:01 PM
mahesh  SSMB29 పై నిర్మాత హాట్ కామెంట్స్
Producer hot comments on Mahesh-Rajamouli combo SSMB29 పై నిర్మాత హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - రాజమౌళి కలయికలో మొదలు కాబోయే పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ చిత్రాన్ని కె ఎల్ నారాయణ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తాజాగా నారాయణ రాజమౌళి-మహేష్ చిత్రం పై చేసిన హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజమౌళి-మహెష్ కాంబోలో సినిమా చెయ్యాలని 15 ఏళ్ళ క్రితమే ఫిక్స్ అయ్యాము. 

ఈమద్యలో రాజమౌళి-మహేష్ కూడా బాగా బిజీ అయ్యారు, వారి రేంజ్ కూడా బాగా పెరిగింది. అయినా నాకిచ్చిన మాట మరిచిపోకుండా నన్ను సంప్రదించకుండానే దుర్గ ఆర్ట్స్ బ్యానర్లో సినిమాని ప్రకటించారు. అందుకు నేను కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నాను, రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ వాటిని కాదనుకుని నాకిచ్చిన మాట కోసం సినిమా చేస్తున్నారు. 

గత రెండు నెలలుగా మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నిర్మాతలు కథా చర్చల్లో పాల్గొన్నారని అంటూ ఉంటారు. అందరి విషయంలో అలా జరగదు. రాజమౌళి అన్ని విషయాల్ని నిర్మాతలతో పంచుకుంటారు. పేపర్ వర్క్ జరుగుతున్నప్పుడే ఏమైనా మార్పులు ఉంటాయేమో చెప్పమని దిగుతారు. 

ఆగష్టు లేదా సెప్టెంబర్ లో మహేష్-రాజమౌళి కాంబో మూవీ మొదలయ్యే ఛాన్స్ వుంది. మహేష్ బాబు కూడా తన కేరెక్టర్ కి తగ్గట్టుగా తనని తాను మలుచుకుంటున్నారంటూ కె.ఎల్ నారాయణ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

Producer hot comments on Mahesh-Rajamouli combo:

K.L Narayana comments Mahesh-Rajamouli movie

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ