సమ్మర్ అంటేనే చెమటలు, వేడి, వేసవి తాపం ఉంటుంది. ఆ తాపాన్ని, ఆ హీట్ నే ఇంకాస్త హీటెక్కించింది రకుల్ ప్రీత్. సౌత్ లో టాప్ చైర్ కి చేరువవుతున్న తరుణంలో స్పైడర్ రూపంలో రకుల్ ప్రీత్ కి బిగ్ షాక్ తగిలింది. ఆ చిత్రం తర్వాత సౌత్ లో ఒకటి రెండు చిత్రాలతో కనుమరుగైపోయింది. ఇప్పుడు ఆమె ఆశ మొత్తం కమల్ హాసన్ ఇండియన్ 2 పైనే. ఇండియన్ 2 జూన్ లో విడుదల కాబోతుంది.
ఇక బాలీవుడ్ లోను నామ మాత్రపు అవకాశాలతో కెరీర్ మసకబారుతున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో మాత్రం పిచ్చ యాక్టీవ్ గా ఉంటుంది. మోడ్రెన్ దుస్తుల్లో అందాలు ఆరబోస్తుంది. ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ ఇన్స్టా లో క్రీమ్ కలర్ మోడ్రెన్ వేర్ లో అందాలు చూపించేసింది. ఈ ఫోటోలు చూస్తూ ఆమె ఫ్యాన్స్ ఇంతటి అందగత్తెకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అసలు వేసవిని మరింత హీటెక్కిస్తున్న రకుల్ అనేలా ఉంది ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ ఉంది. ఇక రకుల్ కెరీర్ ఎలా ఉన్నా ఈమధ్యనే ఆమె హైదరాబాద్ లో ఫుడ్ బిజినెస్ అదేనండి రెస్టారెంట్ ఓపెన్ చేసింది. అందుకోసం ఆమె కొద్దిరోజులుగా హైదరాబాద్ లోనే హడావిడి చేసింది.