గత ఎన్నికల్లో వైసీపీ వెనుక కాస్త సినీ గ్లామర్ కనిపించింది. అలీ, పృథ్వి, జీవిత రాజశేఖర్ లాంటి వాళ్ళు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రచారం చేసారు. మోహన్ బాబు, మంచు విష్ణు జగన్ కి సపోర్ట్ చేసారు. జీవిత రాజశేఖర్ ఇలా చాలా మంది. కానీ ఈ ఎన్నికల్లో జగన్ కి సినీ గ్లామర్ సపోర్ట్ లేదు. ఆయన కోరకపోయినా జగన్ పైన అభిమానంతో పలువురు సినీ ప్రముఖులు తామంత తామే వచ్చారు.
కేవలం నగరిలో పోటీ చేస్తున్న రోజా తప్ప మిగతా సినిమా ఇండస్ట్రీ పీపుల్ ఎవ్వరూ వైసీపీ కి ప్రచారం చేసే ఉద్దేశ్యంలో కనిపించడం లేదు. రోజా వెనుక జబర్దస్త్ గ్యాంగ్ లేదు, అందరూ హ్యాండ్ ఇచ్చి పవన్ కి జై కొట్టారు. ఆలీకి సీటివ్వలేదు. దానితో ఈ ఎన్నికల ప్రచారంలో ఆలీ కనిపించడం లేదు, కనీసం వైసీపీ ఎన్నికల ప్రచార కమిటీలో ఆలీ పేరు కూడా లేకుండా చేసింది వైసీపీ. పృథ్వి జనసేనలో జాయిన్ అయ్యాడు.
ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ తరపున స్టార్ క్యాంపెయినర్ల తరహాలో వచ్చే వారే కనిపించడం లేదు. దీంతో నియోజకవర్గాల్లో అభ్యర్థులు.. స్వతంత్ర అభ్యర్థుల తరహాలో తమ ప్రచారాన్ని ఒంటరిగా చేసుకుపోతున్నారు. అసలు వైసీపీ కి సినీ గ్లామర్ దూరం కావడానికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరును జగన్ అవమానించడమనే న్యూస్ బాగా వైరల్ అయ్యింది.
సినిమా ఇండస్ట్రీ కోసం చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి, మహేష్, కొరటాల వంటి వారు జగన్ ని కలవడానికి వెళితే అప్పట్లో చిరు ని జగన్ అవమానించారంటూ ఇప్పటికి టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. అందుకే సినిమా వాళ్ళెవరూ జగన్ వైపు కన్నెత్తి చూడడం లేదు అనే న్యూస్ వినిపిస్తోంది.
మరోపక్క స్టార్ క్యాంపెయినర్లుగా ఫృథ్వీ, వరణ్ తేజ్, అంబటి రాయుడు, హైపర్ ఆది, సీరియల్ నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతో మంది రంగంలోకి దిగి కూటమి అభ్యర్థుల తరపున ప్రచారాలు చేస్తున్నారు.