Advertisementt

తారక్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ: రాజమౌళి

Thu 02nd May 2024 12:32 PM
rajamouli  తారక్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ: రాజమౌళి
Tarak is more than a friend: Rajamouli తారక్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ: రాజమౌళి
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి, తారక్ మధ్యన చాలా అనుబంధం ఉంది. చాలామంది హీరోల కన్నా ఎన్టీఆర్ తోనే రాజమౌళి ఎక్కువ సినిమాలు చేసారు. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలని చేసిన రాజమౌళి ని ఎన్టీఆర్ ప్రేమగా జక్కన్నా అని పిలుస్తాడనే విషయం తెలిసిందే. 

తాజాగా రాజమౌళి తారక్ తనకి ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని, తమ్ముడిలాంటి వాడంటూ మాట్లాడి ఎన్టీఆర్ అభిమానులని ఎగ్జైట్ చేసారు. గత రాత్రి కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళి ఎన్టీఆర్ తనకి ఫ్రెండ్ అని అనలేను తమ్ముడి టైప్, ఇంకా బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటిలు చాలామంచి స్నేహితులు అంటూ చెప్పారు. 

మరి ఎన్టీఆర్ ని ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ ని చేసిన రాజమౌళి ఎన్టీఆర్ పై ఇలా ప్రత్యేకమైన అభిమానం చూపడం ఎన్టీఆర్ ఫాన్స్ కే కాదు చాలామందికి ఇంట్రెస్టింగ్ గా మారింది.  

Tarak is more than a friend: Rajamouli:

Rajamouli About Tarak

Tags:   RAJAMOULI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ