Advertisementt

ఏపీ ప్రజలారా.. ఓటెవరికో ఇప్పుడు చెప్పండి!

Thu 02nd May 2024 11:36 AM
tdp  ఏపీ ప్రజలారా.. ఓటెవరికో ఇప్పుడు చెప్పండి!
People of AP.. tell the voters now! ఏపీ ప్రజలారా.. ఓటెవరికో ఇప్పుడు చెప్పండి!
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం చేసైనా.. ఎన్ని హామీలిచ్చి అయినా సరే గెలిచి తీరాల్సిందేనని అధికార వైసీపీ, కూటమి పార్టీలు (టీడీపీ, బీజేపీ, జనసేన) ఇష్టమొచ్చినట్లుగా హామీలిచ్చేశాయి. ఇదిగో.. మేం ఫలానా ఇస్తామని వైసీపీ అంటే.. అబ్బే అంతకుమించే మేమిస్తాం అని టీడీపీ చెబుతోంది. దీంతో అసలు ఎవరికి ఓటేయాలి..? ఎవర్ని గెలిపించి.. సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనే దానిపై రాష్ట్ర ప్రజలు ఒకింత గందరగోళం చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే.. రెండు పార్టీలు రిలీజ్ చేసిన మేనిఫెస్టోతో తికమక పడుతుండటమే ఇందుకు కారణం. అసలు ఏ పార్టీతో ప్రజలకు ఎంత లబ్ధి చేకూరబోతోంది..? వైసీపీ ఓటేస్తే ఏడాదికి ఒక కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుంది..? అదే టీడీపీకి ఓటేసి గెలిపిస్తే ఏయే పథకాల ద్వారా ఎంతొస్తుంది..? అనే విషయాలను నిశితంగా పరిశీలిద్దాం వచ్చేయండి..!

ఇదీ అసలు సంగతి..!

రైతులు :-

వైసీపీ : రైతు భరోసా- రూ. 16,500/-

టీడీపీ : అన్నదాత- రూ. 20,000/-

కౌలు రైతులు:-

వైసీపీ : రైతు భరోసా - రూ. 16,500/-

 టీడీపీ : అన్నదాత- రూ. 20,500/-

వృద్ధాప్య పెన్షన్లు:-

వైసీపీ : రూ. 3,500/- (2029)

టీడీపీ : రూ. 4,000/- (2024 జూన్ నుంచే)

దివ్యాంగుల పెన్షన్లు:-

వైసీపీ : రూ. 3,500/- (2029లో)

టీడీపీ : రూ. 6,000/- (2024 జూన్ నుంచే)

పిల్లలు బడికి వెళ్తే:- (ఇద్దరు పిల్లలు)

వైసీపీ : అమ్మ ఒడి - రూ. 17,000/-

టీడీపీ : తల్లికి వందనం - రూ. 30,000/-

మహిళలకు :-

వైసీపీ : చేయూత - రూ. 16,500/- (45-60 ఏళ్ల మధ్య)

టీడీపీ : మహాశక్తి - రూ. 18,000/- (18-60 ఏళ్ల మధ్య)

ఆర్టీసీ ప్రయాణం :-

వైసీపీ : ఊసే లేదు..

టీడీపీ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

గ్యాస్ సిలిండర్లు :-

వైసీపీ : ప్రస్తావనే లేదు..

టీడీపీ : దీపం- 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం

పెళ్లి కానుకలు :-

వైసీపీ : రూ. 50,000/-

టీడీపీ : రూ. 1,00,000/-

వాలంటీర్ల జీతాలు :-

వైసీపీ : రూ. 5,000/-

టీడీపీ : రూ. 10,000/-

అన్న క్యాంటిన్లు :-

వైసీపీ : లేవు..

టీడీపీ : రూ. 15 కే మూడు పూటలా భోజనం

డీఎస్సీ :-

వైసీపీ : అస్సలు లేవు

టీడీపీ : మొదటి సంతకం డీఎస్సీ పైనే..!

చూశారు కదా.. ఎవరి ప్రభుత్వంలో ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందనేది. ఇంకెందుకు ఆలస్యం మీకు ఎవరిపైన నమ్మకం ఉంది..? ఎవరైతే చెప్పినవన్నీ అమలు చేస్తారు..? 2014 ఎన్నికల్లో గెలిచాక విజనరీ చంద్రబాబు ఏ మాత్రం ప్రజలకు మేలు చేశారు..? 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నవరత్నాలు అని చెప్పిన వైఎస్ జగన్ హయంలో ఎంత మందికి లబ్ధి జరిగింది..? ప్రజలకు ఒరిగిందేంటి..? అనే విషయాలు ఇంటిల్లిపాది కూర్చోని చర్చించుకుని.. ఎవరైతే హామీలు నెరవేరుస్తారని మీకు నమ్మకం కలుగుతుందో వారికే ఓటేసేయండి.. గెలిపించేయండి.. ముఖ్యమంత్రిని చేసేయండి..!.  ఏపీ ప్రజలారా.. ఎవరో చెప్పారనే.. ఏదో చేస్తారనో కాకుండా ఓటు అనేది హక్కుగా భావించి.. స్వతంత్రంగా ఓటేయండి.. మీ బంగారు భవిష్యత్తకు బాటలు వేసుకోండి..!!

People of AP.. tell the voters now!:

TDP vs YCP manifesto

Tags:   TDP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ