Advertisementt

పుష్ప సాంగ్ కన్నా అల్లు అర్జున్ స్టెప్స్ అదుర్స్

Thu 02nd May 2024 10:56 AM
pushpa 2 the rule  పుష్ప సాంగ్ కన్నా అల్లు అర్జున్ స్టెప్స్ అదుర్స్
First single from Pushpa 2 The Rule పుష్ప సాంగ్ కన్నా అల్లు అర్జున్ స్టెప్స్ అదుర్స్
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ నుంచి నిన్న మే 1 న పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్ అనే సాంగ్ ని వదిలారు. పుష్ప పార్ట్ 1 లో మ్యూజిక్ ఆల్బమ్ బాగా హిట్ అవడంతో పుష్ప 2 సాంగ్స్ పై అంచనాలు పెరిగాయి. కానీ పార్ట్ 2 ఫస్ట్ సాంగ్ పార్ట్1 పాటలతో పోటీపడలేకపోయింది అంటూ సోషల్ మీడియాలో ఈ పాటపై మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. 

పుష్ప 2 ఫస్ట్ సాంగ్ అంత లేదు బాసు, పార్ట్ 1 సాంగ్స్ అదుర్స్, దేవిశ్రీ పార్ట్ 2 సాంగ్ కి మంచి మ్యూజిక్ ఇచ్చినా లిరిక్స్ అంతగా లేవు అని కొంతమంది, చాలా బావుంది, గూస్ బంప్స్ పక్కా, అదిరిపోయిన పుష్ప సాంగ్ అంటూ రకరకాలుగా పుష్ప సాంగ్ పై స్పందిస్తున్నారు. 

మరోపక్క పుష్ప సాంగ్ ఎలా అంటే ఏమిటి అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. అల్లు అర్జున్ మరోసారి తన సిగ్నేచర్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసారు. అల్లు అర్జున్ కాలు మడతపెట్టి వేసిన స్టెప్ కి అల్లు ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నారు. అందుకే పాట ఎలా ఉంటే మాత్రమేమిటి అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ వీడియో మాత్రం అదుర్స్.. మళ్ళి పుష్ప రాజ్ హిట్ కొట్టేస్తాడెహె అంటూ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇక ఆగష్టు 15న విడుదల కాబోతున్న పుష్ప ద రూల్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ లాంగ్వేజెస్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

First single from Pushpa 2 The Rule:

Pushpa 2 The Rule 1st song released 

Tags:   PUSHPA 2 THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ