Advertisementt

హరి హర వీర మల్లు టీజర్ రివ్యూ

Thu 02nd May 2024 09:21 AM
hari hara veeramallu  హరి హర వీర మల్లు టీజర్ రివ్యూ
Hari Hara Veeramallu Teaser Review హరి హర వీర మల్లు టీజర్ రివ్యూ
Advertisement

పవన్ కళ్యాణ్ నటించిన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో ఇట్టె వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా హరి హర వీర మల్లు అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌ సినిమాలో నటిస్తున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.

వీరమల్లుగా పవన్ కళ్యాణ్ సాహసాలను చూడటం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని ప్రకటిస్తూ, మొదటి భాగం నుండి టీజర్‌ను విడుదల చేశారు. మొదటి భాగం హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం అనేది దానికి ఉపశీర్షిక.

వేరమల్లు టీజర్లోకి వెళితే.. పేదలు దోపిడీకి గురవుతూ, ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో.. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కళ్యాణ్ పోషిస్తున్న హరి హర వీర మల్లు పాత్రను టీజర్ లో చూపించారు. హరి హర వీర మల్లు పాత్ర తీరుని తెలుపుతూ.. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో థియేటర్లలో ఒక గొప్ప అనుభూతిని అందించనున్నట్లు టీజర్ లో స్పష్టం అవుతుంది. 

పేద, అణగారిన వర్గాలకు అండగా నిలబడే వీరుడిలా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే, మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. ఆహార్యం పరంగా, అభినయం పరంగా ఇద్దరూ ఆయా పాత్రలకు వన్నె తెచ్చారని టీజర్ తోనే అర్థమవుతోంది. టీజర్ లో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా నైనా, న్యాయం కోసం పేదల పక్షాన చేస్తున్న ఆ యోధుడి పోరాటం స్ఫూర్తిని కలిగిస్తోంది.

టీజర్ విడుదల సందర్భంగా, నిర్మాతలు ఒక కీలక ప్రకటన చేశారు. ఎనక్కు 20 ఉనక్కు 18, నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మరియు నట్పుక్కాగ, పడయప్ప వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన రచయిత-దర్శకుడు జ్యోతి కృష్ణ, హరి హర వీర మల్లు చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు.

Hari Hara Veeramallu Teaser Review:

Hari Hara Veeramallu Teaser Released 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement