వైస్ జగన్ ని నమ్ముకుని వైస్సార్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకున్న ఆలీ ఇప్పుడు రెండికి చెడ్డ రేవడిలా తరయారయ్యాడా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆలీకి అప్పట్లో జగన్ టికెట్ కేటాయించలేకపోయారు. కానీ ఆలీ మాత్రం వైసీపీ తరుపున ప్రచారం చేసాడు. ఆలీ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది.
జగన్ సీఎం అయ్యాక ఆలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆలీకి గత ఏడాది వరకు ఎలాంటి పదవి లభించలేదు. ఆలీకి జగన్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పోస్టుతో సరిపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆలీ మాత్రం వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నంద్యాల, గుంటూరు నియోజకవర్గాల్లో ఆలీ పేరు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది.
వైసీపీ నే నమ్ముకున్న ఆలీకి వచ్చే ఎన్నికల్లో ఎక్కడా కూడా సీటు దక్కని పరిస్థితి. మైనారిటీ కోటాలో వచ్చే రాజ్యసభ సీటును కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ పాషాకు ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో ఆలీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లడమే కాదు.. కనీసం ఆలీ పేరు ప్రచార కమిటీలో కూడా లేకపోవడంతో జగన్ ఆలీకి షాకిచ్చినట్టే అని గుసగుసలు మొదలయ్యాయి. పాపం ఆలీ ఎమ్యెల్యేగా గెలిచి పదవి చేపట్టాలని చాలా ఆశపడి ఇప్పుడు భంగపడ్డాడు.