అవును.. ఎన్నికల ముందే గెలుపెవరిదో తేలిపోయింది..! వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెత్తిన.. టీడీపీ అధినేత చంద్రబాబు పాలు పోసేశారు. ఇక ఎన్నికలు జరగడం.. ఫలితాలు రావడమే ఆలస్యం అన్నట్లుగా వైసీపీ ఓ రేంజ్‌లో ప్రచారం చేసుకుంటోంది. ఎందుకంటే.. వైసీపీ మేనిఫెస్టో 2019 ఎన్నికల నవరత్నాలును.. 2024లో నవరత్నాలు 2.0గా ప్రకటించడం.. కొన్ని పథకాలకు నగదు పెంచడం, ఇంకొన్ని కొత్తవి జతచేసి కేవలం రెండంటే రెండు పేజీలు, 9 హామీలతోనే రిలీజ్ చేశారు జగన్. అయితే.. ఇందులో డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ చేయాలని వైసీపీ అగ్రనేతలు పదే పదే చెప్పినప్పటికీ.. అస్సలు వద్దంటే వద్దని జగన్ ప్రకటించలేదు. కూటమి మేనిఫెస్టోలో ఈ రెండూ ఉంటే పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పినా కూడా వైసీపీ అధినేత మొండిగానే ముందుకెళ్లారన్నది నిన్న, మొన్నటి వరకూ నడిచిన చర్చ.
తగ్గేదేలే అంటూ తగ్గారేం..?
వైసీపీ అనుకున్నట్లుగా.. ఏదేదో ఊహించుకున్నట్లుగా కూటమి మేనిఫెస్టో అస్సలు లేదు. ఆ రెండు విషయాల జోలికి చంద్రబాబు అస్సలు పోలేదు. ఎందుకు ప్రకటన చేయలేదు..? ప్రకటన చేద్దామనుకున్న సమయంలో ఏం జరిగింది..? అనేది క్లియర్ కట్‌గా తెలియట్లేదు కానీ.. ఏదో జరగరానిదే జరిగిందన్నది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా.. ఏపీ ఆదాయం ఎంత..? తాను ప్రకటించిన హామీలకు ఎంతవుతుంది..?.. ఇప్పటి వరకూ సూపర్ సిక్స్ పేరిట చంద్రబాబు ప్రకటించిన హామీలకు ఎంత ఖర్చు అవుతుంది..? అనే విషయాలను లెక్కలేసి మరీ చెప్పారు. దీంతో పాటు చంద్రబాబు హామీలకు ఇంకెన్ని కోట్లు అప్పులు చేయాల్సి వస్తుందనే విషయాలు కూడా కుండ బద్ధలు కొట్టి మరీ చెప్పారు. దీంతో బాబు, పవన్‌లు వెనక్కి తగ్గారనే చర్చ జరుగుతోంది. ఇదే జగన్ నెత్తిన పాలు పోసినట్లయ్యింది.
వైసీపీ ఊపిరి పీల్చుకో!
చూశారుగా.. మేనిఫెస్టో విషయంలో కూటమిలో రచ్చ.. పైగా కొత్త విషయాలేమీ లేకపోవడం, దీంతో పాటు కాపీ కొట్టిన మేనిఫెస్టో ఇవన్నీ టీడీపీని, చంద్రబాబును విమర్శించడానికి పెద్ద అస్త్రాలుగా వైసీపీకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన మరుసటి రోజు నుంచే జగన్ ఏ రేంజ్‌లో బ్యాటింగ్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సో.. రుణమాఫీ అనే పదం లేకపోవడంతో వైసీపీ ఇప్పుడు గట్టిగానే ఊపిరి పీల్చుకోవచ్చన్న మాట. పైగా.. కేంద్రం నుంచి ఎలాంటి సపోర్టు ముఖ్యంగా.. మోదీ, అమిత్ షాల ద్వయం నుంచి ఎలాంటి మద్దతు ఉండదనే చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే అలివిగానీ హామీలు ఇస్తే అస్సలు ఒప్పుకునేదే లేదని ఢిల్లీలోని కమలనాథులు గట్టిగానే బాబు, పవన్‌లను హెచ్చరించారనే చర్చ అయితే సోషల్ మీడియా జరుగుతోంది. చూశారుగా.. ఇదీ కూటమిలో పరిస్థితి!