ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం నటనకు దూరంగా తన పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటుంది. గత ఏడాది ఓ బాబుకి తల్లయిన ఇలియానా ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే గతంలో దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అవుదామనుకుంది. అక్కడ ఒక్క హిట్ తోనే కనుమరుగైన ఆమె ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో ప్రేమ, బ్రేకప్, డిప్రెషన్ తో సఫర్ అయ్యింది.
తాజాగా ఇలియానా తనకి సౌత్ అవకాశాలు రాకపోవడానికి కారణాలేమిటో రివీల్ చేసింది. తనకి 2012లో బాలీవుడ్ నుంచి అనురాగ్ బసు దర్శకత్వంలో బాలీవుడ్ లో బర్ఫీ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సమయంలో నేను సౌత్ లో చాలా బిజీగా ఉన్నాను. కానీ బర్ఫీ వంటి చిత్రాల్లో అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని భావించి దానినే ఎన్నుకున్నాను. దానితో సౌత్ డైరెక్టర్స్ తాను సౌత్ ను వదిలేసి బాలీవుడ్ కి మకాం మార్చానని భావించారు.
అదే ఆలోచనతోనే దక్షిణాది దర్శకనిర్మాతలు తనకు అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు, బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత సినిమాలను ఎంచుకునే విధానంలో తనలో కూడా మార్పు వచ్చిందని, ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా తనకు రావాల్సిన గుర్తింపు దక్కలేదు అని తనకు అనిపిస్తుంటుందని చెప్పడమే కాదు.. అసలు ఇలా ఎందుకు జరిగిందో కూడా తనకు అర్థం కావడం లేదని కూడా ఇలియానా చెప్పుకొచ్చింది.