అవును.. అదిగో.. ఇదిగో అంటూ ఊరించిన కూటమి మేనిఫెస్టో వచ్చేసింది. వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే.. టీడీపీ, జనసేన, టీడీపీ మేనిఫెస్టోలో ఏదో అద్భుతాలు ఉంటాయని ఏపీ ప్రజలు ఆశపడ్డారు. ఇంతకీ మేనిఫెస్టోలో ఏముంది..? కూటమి నేతలు ఇచ్చిన కీలక హామీలేంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..!
మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రేపటి ఆకాంక్షలు సాకారం చేసేవిధంగా మేనిఫెస్టో
రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది
పోలవరం నదుల అనుసంధానాన్ని గోదావరిలో ముంచారు
ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు
వందకుపైగా టీడీపీ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు
పట్టా పాసు పుస్తకాల మీద జగన్ ఫొటో పెట్టారు
లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారు
స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్లు మళ్లించారు
రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ముందుకు వచ్చింది : పవన్
సూపర్ సిక్స్‌తో మీ ముందుకొచ్చాం..!
కేంద్రం సహకారం రాష్ట్రానికి మెండుగా ఉంటుందన్న చంద్రబాబు
సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు వచ్చాం
రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో కూటమిగా జట్టుకట్టాం
తెలుగు జాతికి పూర్వవైభవం రావాలనే ఆకాంక్షతో ముందుకు వచ్చాం
NDA జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది
టీడీపీ, జనసేన కలిపి మేనిఫెస్టో తయారుచేశాం
మేనిఫెస్టో రూపకల్పనలో బీజేపీ కూడా కొన్ని సూచనలు చేసింది
బీజేపీ కూడా కూటమి మేనిఫెస్టోను ఎండార్స్ చేసింది
బీజేపీ సహకారంతో రాష్ట్రంలో కూటమికి ఉంటుంది
మెగా డీఎస్సీపై తొలి సంతకం
డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువస్తాం
బీసీ డిక్లరేషన్, 50 ఏళ్లకు పెన్షన్, రక్షణ చట్టం తెస్తాం
చట్టసభల్లో, 33 శాతం రిజర్వేషన్ ప్రతిపాదన కేంద్రానికి పంపుతాం
ఆదరణ కింద రూ.5 వేల కోట్లు కేటాయిస్తాం
పాడిపరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెడతాం
చేనేత పరిశ్రమలో పవర్ లూమ్స్‌కు 500 విద్యుత్ యూనిట్లు ఫ్రీగా ఇస్తాం : చంద్రబాబు
ప్రజలను గెలిపించేందుకే..!
ప్రజలను గెలిపించేందుకే మా (టీడీపీ, జనసేన, బీజేపీ) కలయిక
ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే మేం సర్దుబాటు చేసుకున్నాం
20 లక్షల మంది యువతకు ఉపాధి
నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు
స్కిల్ గణన చేపడతాం..
ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు
10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేస్తాం.
మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం : చంద్రబాబు
బీసీల కోసం..!
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతాం
బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు
బీసీ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తాం
బీసీల స్వయంఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు
ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు చేస్తాం
పవర్‌లూమ్, హ్యాండ్‌లూమ్‌లకు కొంతమేర ఉచిత విద్యుత్
మత్స్యకారులను ఆదుకుంటాం
డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం.
సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పంచుతాం: చంద్రబాబు
ముఖ్యమైన హామీలు..
మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం
దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితం
ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం
కూటమి మేనిఫెస్టో హామీలు ఇవే..!
1. మెగా డీఎస్సీపై తొలి సంతకం
2. వృద్ధాప్య పెన్షన్ రూ.4000
3. దివ్యాంగుల పెన్షన్ రూ.6000
4. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500
5. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం
6. యువతకు 20 లక్షల ఉద్యోగాలు
7. రూ.3000 నిరుద్యోగ భృతి
8. తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000
9. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
10. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి
11. వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000
12. ఉచిత ఇసుక
13. అన్నా క్యాంటీన్లు
14. భూ హక్కు చట్టం రద్దు
15. ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్
16. బీసీ రక్షణ చట్టం
17. పూర్ టూ రిచ్ పథకం
18. చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ
19. కరెంటు చార్జీలు పెంచం
20. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్
21. పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం
22. పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం
23. పెళ్లి కానుక రూ.1,00,000/-
24. విదేశీ విద్య పథకం
25. పండుగ కానుకలు.