అనుపమ పరమేశ్వరన్ ఏం కోరుకుందో అది నెరవేరినట్టే కనిపిస్తుంది. పద్దతిగా మడి కట్టుకుని కూర్చుంటే పని జరగదని అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేసి.. బోల్డ్ కేరెక్టర్స్ కి ఓకె చెప్పేసింది. టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ సిద్దు జొన్నలగడ్డతో చేసిన రొమాన్స్, ఆమె గ్లామర్ షో అన్ని అనుపమలోని మరో యాంగిల్ ని పరిచయం చేసాయి. ఎలాంటి అనుపమ ఎలా అయ్యిపోయింది అనుకున్నోళ్ళకి తన ముందుకు వస్తున్న ఆఫర్స్ తో సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే సమంత బ్యానర్ లో పరదా మూవీ లో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ కి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన కొత్త ప్రాజెక్టు ఓకే అయ్యిందని సమాచారం. ఈ చిత్రానికి కిష్కిందకాండ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కార్తికేయ2 లాంటి ప్యాన్ ఇండియా హిట్ తర్వాత కూడా అనుపమని పట్టించుకోలేదు. కానీ టిల్లు స్క్వేర్ మాత్రం ఆమెకి బాగానే ఫెవర్ చేసింది.
అందుకే వరసబెట్టి అవకాశాలు అనుపమ పరమేశ్వరన్ తలుపు తడుతున్నాయి. అనుపమ మలయాళంలో చేస్తున్న జెఎస్కెని ప్యాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇదంతా అనుపమ కోరుకున్న అవకాశాలే. టిల్లు స్క్వేర్ మహిమే. నిన్నమొన్నటివరకు ఆఫర్స్ కోసం అల్లాడిన అనుపమకు ఫైనల్లీ ఈ అవకాశాలతో ఊరట లభించినట్లే.