రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చెంజర్ షూటింగ్ లో తలమునకలై ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో మూడు లాంగ్వేజెస్ లో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చరణ్ కియారా అద్వానీతో రొమాన్స్ చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో రీసెంట్ గానే RC16 న మొదలు పెట్టారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది.
అయితే ఈ చిత్రం కోసం బుచ్చిబాబు అన్నీ భారీగానే ఆలోచిస్తున్నాడు. అంటే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ RC16 కోసం సంప్రదించి గ్రీన్ సిగ్నల్ ఇప్పించడం దగ్గర నుంచి ఏ ఏ ఆర్ రెహ్మాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకురావడం, అలాగే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ ని సెట్ చెయ్యడం ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ పెంచే డెసిషన్స్.
గత నెలలోనే పట్టెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు పక్కా ప్రణాళిక తో సిద్ధం చేసుకొని ఉన్నారు. రామ్ చరణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అదే బాబీ డియోల్. యానిమల్ చిత్రంతో పలు భాషా ప్రేక్షకులకి పరిచయమైన బాబీ డియోల్ ప్రస్తుతం తెలుగులో NBK 109 లో చేస్తున్నారు. ఇప్పుడు RC 16 లోను రామ్ చరణ్ కి విలన్ గా డియోల్ ని బుచ్చి బాబు తీసుకురాబోతున్నాడనే న్యూస్ వైరల్ అయ్యింది.