మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లోకి అడుగుపెట్టింది మొదలు దర్శకుడు వసిష్ఠ షూటింగ్ ని చక చకా చుట్టేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతున్న విశ్వంభర చిత్ర షూటింగ్ లో మెగాస్టార్ కూడా హుషారుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం వసిష్ఠ యాక్షన్ సీక్వెన్స్ తో పాటుగా చిరు-త్రిష కాంబోలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఇప్పుడు విశ్వంభర ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీన్ పై ఓ క్రేజీ అప్ డేట్ వైరల్ గా మారింది. ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి రెండో క్యారెక్టర్ రివీల్ అవుతుందని, విశ్వంభర సినిమా మొత్తానికే ఈ సీన్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని, ఈ సీన్ రాగానే మెగా ఫాన్స్ నుంచే కాదు, మాస్ ఆడియన్స్ నుంచి కూడా విజిల్స్ ఖాయమంటున్నారు.
ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఫ్యామిలీ ఎమోషన్ కూడా హైలైట్ గా ఉంటుందని వినికిడి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సురభి, మరో హీరోయిన్ చిరుకి సిస్టర్స్ కేరెక్టర్స్ లో నటిస్తున్నారు.