Advertisementt

వైసీపీ మేనిఫెస్టో తర్వాత తొలి సర్వే..

Mon 29th Apr 2024 12:29 PM
ycp  వైసీపీ మేనిఫెస్టో తర్వాత తొలి సర్వే..
YSRCP వైసీపీ మేనిఫెస్టో తర్వాత తొలి సర్వే..
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్‌లో గెలుపు ఎవరిది అనే ప్రశ్నకు ఎవరి నోట విన్నా.. ఏ సర్వేలో చూసినా వైసీపీ.. వైసీపీ అనే మాటే వస్తోంది. ఎందుకంటే.. 2019-2024 వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాలనను మెచ్చి.. మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ప్రజలు రెడీ అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటివరకూ వచ్చిన సర్వేలను బట్టి చూస్తే.. ఎన్నికల ముందే జగన్ గెలిచేశారని చెప్పుకోవచ్చు. వార్ వన్ సైడ్ అయిపోగా.. కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం బరిలో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా పరిస్థితి ఉంది. మేనిఫెస్టో రిలీజ్‌ చేయక ముందు పదుల సంఖ్యలో సర్వేలో వైసీపీదే గెలుపని తేల్చగా.. రిలీజ్ చేశాక ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయ్.. ఏంటి..? అనేది తొలిసారిగా ఆంధ్రా లైవ్ న్యూస్ అనే మీడియా సంస్థ సర్వే చేయగా.. ఊహంచని రీతిలో వైసీపీకి సీట్లు వస్తాయని చెప్పడం విశేషం.

లెక్కలివిగో..!

175 ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 149, టీడీపీకి (కూటమి) 26 స్థానాలు మాత్రమే వస్తాయని ఏఎల్ఎన్ (ఆంధ్రా లైవ్ న్యూస్ ) తేల్చిచెప్పేసింది. ఇక ఎవరికెంత ఓటు శాతం అనే విషయానికొస్తే.. వైసీపీ 51 శాతం, టీడీపీ కూటమికి 41 శాతం, ఇండియా కూటమికి కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది. ఇక మెజారిటీ విషయానికి వస్తే.. 79 స్థానాల్లో 10 వేల పైచిలుకు మెజారిటీ వచ్చే అవకాశం ఉందని సదరు సర్వే సంస్థ తెలిపింది. ఇక వైసీపీకి 5 నుంచి 10 వేల మెజారిటీ 57 స్థానాలు, ఐదు వేల లోపు 13 స్థానాల్లో మెజారిటీ వస్తుందని ఆంధ్రా లైవ్ న్యూస్ సంస్థ క్లియర్ కట్‌గా చెప్పేసింది. మొత్తానికి రెండోసారి వైసీపీ అధికారంలోకి రాబోతోందని చెప్పకనే చెప్పేసిందన్న మాట. కాగా.. నియోజకవర్గానికి 550 మంది చొప్పున విచారించి ఈ సర్వే నిర్వహించినట్లు ఏఎల్ఎన్ సంస్థ ప్రకటనలో తెలిపింది.

సర్వేను బట్టి చూస్తే..!

2019 ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు రాగా ఈ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే తగ్గి 149 సీట్లు వస్తాయని చెప్పడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఈ సర్వేను నిశితంగా పరిశీలిస్తే.. కీలక నియోజకవర్గాలు, కుటుంబాలు ఏలిన నియోజకవర్గాలు, టీడీపీ కంచుకోటలన్నీ కూలిపోయాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు పోటీచేస్తున్న కుప్పంలో కేవలం 19వేల మెజార్టీతో గెలుస్తారని సర్వేలో తేలడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇక హిందూపురంలో బాలయ్యే మళ్లీ గెలుస్తున్నారు.. అది కూడా 15వేల మెజార్టీతో అని ఏఎల్ఎన్ తేల్చింది. అయితే.. దాదాపు గత ఎన్నికల సీన్ ఈసారీ రిపీట్ కాబోతోంది. అయితే.. రాయలసీమలో ఒకట్రెండు సీట్లు మాత్రమే మునుపటితో టీడీపీ పెంచుకోగలిగింది.

కూటమి గెలిచే స్థానాలివే..!

టెక్కలి, బొబ్బిలి, శృంగవరపుకోట, గాజువాక, పెద్దాపురం, ముమ్మిడివరం, రాజోలు, మండపేట, రాజమండ్రి సిటీ, పాలకొల్లు, ఉండి, తణుకు, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, తాడికొండ, రేపల్లె, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, చిలకలూరిపేట, సంతనూతలపాడు, రాయదుర్గం, మడకశిర, హిందూపురం, పెనుకొండ, కుప్పం నియోజకవర్గాల్లో కూటమి తరఫున బరిలోకి దిగిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలవబోతున్నారని ఏఎల్ఎన్ తేల్చింది. 

YSRCP:

YCP

Tags:   YCP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ