కామెడీ హీరో అల్లరి నరేష్ గతంలో మహేష్ బాబు మహర్షి చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసాడు. మహేష్ కి స్నేహితుడిగా ఎమోషనల్ గా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున నా సామిరంగాలో నాగ్ కి బ్రదర్ కేరెక్టర్ లో కనిపించాడు. గతంలో హీరో రోల్స్, కామెడీ రోల్స్ చేసిన అల్లరి నరేష్ ఈ మద్యన ఏ స్టార్ హీరో చిత్రంలో సపోర్టింగ్ రోల్ దొరికినా చేస్తాను అనడంతో.. అల్లరి నరేష్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో ఓ కేరెక్టర్ చేస్తున్నాడనే ప్రచారం మొదలైంది.
అయితే అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్ర ఇంటర్వ్యూలో భాగంగా తాను దేవర చిత్రంలో నటిస్తున్నాను అని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. దేవర చిత్రం లో నేను ఏ పాత్రలో నటించడం లేదు. అవన్నీ రూమర్ మాత్రమే.. అంటూ క్లారిటీ ఇవ్వడమే కాదు.. ఒకవేళ నాకు ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.
ఎన్టీఆర్ మాత్రమే కాదు టాలీవుడ్ హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు నేను రెడీగా ఉన్నాను అంటూ అల్లరోడు దేవర న్యూస్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.