మలయాళ కుట్టి మాళవిక మోహనన్ స్టార్ స్టేటస్ అందుకోవడానికి చాలా కష్టపడుతుంది. కోలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా అమ్మడుకి అనుకున్న ఫేమ్ అయితే రావడం లేదు. తమిళ్లో విజయ్, ధనుష్ చిత్రాల్లో మాళవిక మోహనన్ నటించింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ లో ఒక హీరోయిన్ గా కనిపించబోతుంది.
సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే మాళవిక మోహనన్ ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని షేర్ చేస్తుంది. ఫ్రెష్ అందాలతో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఎక్కువగా గ్లామర్ షో కి ప్రాధాన్యతనిచ్చే మాళవిక మోహనన్ తాజాగా బ్లాక్ ట్రాన్ఫరెంట్ శారీ లో స్పెషల్ గా కనిపించింది. అందాలు చూపించకపోయినా మాళవిక గ్లామర్ గానే కనిపించింది.
ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో రాజా సాబ్ తో బ్రేక్ అందుకోవాలని చూస్తుంది. ఆ చిత్రం హిట్ అయితే మాళవిక కి మరిన్ని తెలుగు అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.