యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ కోసం ముంబై లో ఉన్నారు. అక్కడ హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 లో నటిస్తున్నారు. రెండు వారాల క్రితమే ఎన్టీఆర్ ముంబై వెళ్లారు. అక్కడకి వెళ్లిన దగ్గరనుంచి ఎన్టీఆర్ ఏదో విధంగా బాలీవుడ్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నారు. ఇక ముంబై అంటే అందులోను బాలీవుడ్ అంటే పార్టీలు, ఫంక్షన్స్, బర్త్ డే పార్టీలు షరా మాములే.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ పార్టీలో సందడి చేసిన పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి డిన్నర్ పార్టీకి వెళ్ళారు. నిన్న రాత్రి ఎన్టీఆర్, తన భార్య ప్రణతితో కలిసి ముంబై బాంద్రాలో డిన్నర్ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి ఎన్టీఆర్, ప్రణతి, రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్ లు అందరూ కలిసి వచ్చారు.
హృతిక్ రోషన్ తో పాటుగా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ డిన్నర్ పార్టీలో పాల్గొన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ బాలీవుడ్ కి వెళ్లిన రెండు వారాల్లోనే భార్యతో కలిసి బాలీవుడ్ సెలబ్రిటీల డిన్నర్ పార్టీకి ఎన్టీఆర్ హాజరయ్యారని తెలిసి అయన ఫాన్స్ భూమ్మీద ఆగడం లేదు. ఎన్టీఆర్ చాలా త్వరగా బాలీవుడ్ కల్చర్ కి అలవాటు పడిపోయాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు.