స్పీడుగా అవకాశాలు దక్కించుకుని క్రేజీ హీరోయిన్ గా మారిన కృతిశెట్టికి హ్యాట్రిక్ విజయాలు ఉత్సాహాన్ని ఇస్తే హ్యాట్రిక్ సినిమాలు నిరాశ పరిచాయి. ఆ సినిమాలు నిరాశపరచడం ఒక ఎత్తయితే.. ఆతర్వాత కృతి శెట్టిని టాలీవుడ్ దర్శకనిర్మాతలు లైట్ తీసుకోవడం మరో ఎత్తు. ఉప్పెన సక్సెస్ లాగే అవకాశాలు కూడా ఉవ్వెత్తున ఎగసి పడడంతో కృతి శెట్టి కి ఊపిరి సలపలేదు.
కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ అవకాశాలు కోసం వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. తమిళనాట ఒకటి రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కృతి శెట్టి టాలీవుడ్ లో శర్వానంద్ తో జత కట్టిన మనమే చిత్రం పై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రం టీజర్ ఈమధ్యనే విడుదలైంది. శర్వానంద్ తో కృతి శెట్టి జోడి బావుంది, ఈ చిత్రం విడుదలై సక్సెస్ అయితే చాలు తనకి మళ్ళీ అవకాశాలు వస్తాయని అనుకుంటుంది.
ఆ చిత్రం హిట్ అయితే కృతి శెట్టి మరోసారి ఫామ్ లోకి రావడం ఖాయమే అందుకే అమ్మడు కూడా ఆ చిత్రంపై చాలానే ఆశలు పెట్టుకుంది. చూద్దాం మనమే కృతి శెట్టికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో అనేది.