అఖిల్ అక్కినేని నటించిన చివరి చిత్రం ఏజెంట్. ఆ ఏజెంట్ విడుదలై నేటికి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది ఇదే రోజు అంటే ఏప్రిల్ 28 న ఏజెంట్ భారీ అంచనాల నడుమ భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ పై ఎన్నో అంచనాలున్నాయి. కారణం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఇందులో భాగమవడమే.
కానీ ఇదే రోజు విడుదలైన ఏజెంట్ ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవ్వలేదు. అఖిల్ ని ఈ చిత్ర రిజల్ట్ బాగా డిస్పాయింట్ చేసింది. థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించేందుకు అక్కినేని అభిమానులు ఏడాది నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ ఏజెంట్ డిజిటల్ హక్కులు దక్కించుకున్న సోని లివ్ ఏజెంట్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు మీన మేషాలు లెక్కబెడుతుంది.
ఏజెంట్ ఓటీటీ పై అభిమానులు అనిల్ సుంకరని అడుగుతున్నా ఆయన మాత్రం నాదేముంది, మేము సోని లివ్ కి ఇచ్చేశాం.. వారి ఇష్టం ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో అంటూ ఉంటారు. మరి ఏజెంట్ థియేటర్స్ లో విడుదలై ఏడాది పూర్తయినా ఇంకా ఓటీటీలోకి రాకపోవడంపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్స్ మొదలయ్యాయి. అక్కినేని అభిమానులైతే ఇప్పటికి ఏజెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు.