ఈరోజు సమంత బర్త్ డే. టాప్ హీరోయిన్స్ అయినా, చిన్న హీరోయిన్స్ అయినా.. బర్త్ డే లు వస్తున్నాయి అంటే.. పుట్టిన రోజు వేడుకలతో పాటుగా వారు నటిస్తున్న సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం అనేది చూస్తున్నాం. బర్త్ డే స్పెషల్ గా వదిలే అప్ డేట్స్ తో ఆయా స్టార్స్ అభిమానులు చాలా అంటే చాలా ఖుషీగా ఉంటారు.
కానీ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు మాత్రం ఈరోజు చాలా డిస్పాయింట్ అవుతున్నారు. కారణం సమంత బర్త్ డే రోజున ఆమె ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ నుంచి కొత్త కబురు ఎమన్నా తెలుస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ సమంత కమ్ బ్యాక్ అయ్యాక స్టార హీరోల ప్రాజెక్ట్ ఏమి ఒప్పుకోలేదు. కేవలం లేడీ ఓరియెంటెడ్ మూవీ బంగారం లుక్ తో అభిమానుల ముందుకు వచ్చింది సామ్. అనారోగ్య కారణాల(మాయోసైటిస్) వలన నటనకు కాస్త బ్రేకిచ్చిన సమంత.. రీ ఎంట్రీకి సిద్దమే అని ప్రకటిచింది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో పనిగట్టుకుని గ్లామర్ షో మొదలు పెట్టింది. గతంలో గ్లామర్ డాలే అయినా.. ఇప్పుడు మరింతగా తన అందాలని ఎక్స్పోజ్ చేస్తుంది. గ్లామర్ షో ఆమె రీ ఎంట్రీకి ఎర అనేమాట గట్టిగానే స్రేడ్ అయ్యింది. మరి సమంత నటనకు రీ ఎంట్రీ ఇస్తున్న విషయం చెప్పి చాలా రోజులవుతున్నా ఆమె కి కేవలం హీరోయిన్ సెంట్రిక్ మూవీ తప్ప ఒక్క స్టార్ అవకాశం కూడా రాలేదా.. అందుకే ఎవ్వరూ సమంత న్యూ ప్రాజెక్ట్ పై ప్రకటన చెయ్యలేదు అని మట్లాడుకుంటున్నారు. దానితో ఆమె అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు.