Advertisementt

ఇండియన్ 2 ఆడియో లాంచ్ వేదిక ఫిక్స్

Sun 28th Apr 2024 01:46 PM
indian 2  ఇండియన్ 2 ఆడియో లాంచ్ వేదిక ఫిక్స్
Indian 2 audio launch venue fix ఇండియన్ 2 ఆడియో లాంచ్ వేదిక ఫిక్స్
Advertisement
Ads by CJ

దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో తెరకెక్కిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ఇండియన్ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవడంతో.. ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే జూన్ నెలలో ఇండియన్ 2 వస్తుంది అని చెప్పినా పక్కాగా ఒక తేదీని ఇవ్వకుండా కమల్ అభిమానులని, భారతీయుడు అభిమానులని వెయిట్ చేయిస్తున్నారు. 

ముందుగా ఇండియన్ 2 జూన్ 15 న రిలీజ్ అవ్వొచ్చనే ప్రచారం జరిగినా.. ఇప్పుడు అది జూన్ 13 నే విడుదలయ్యే అవకాశం ఉంది..  బక్రీద్ హాలిడే కలిసొచ్చేలా ఈ తేదీని ఇండియన్ 2 మేకర్స్ ఫిక్స్ చేసారని, త్వరలోనే అధికారికంగా ఇండియన్ 2 తేదీని ప్రకటించబోతున్నారని సమాచారం. జూన్ 13 న ఇండియన్ 2 వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.. 

ఇక ఇండియన్ 2 ప్రమోషన్స్ ని కూడా శంకర్ భారీగానే ప్లాన్ చేస్తున్నారట. అందులో ముఖ్యంగా ఇండియన్ 2 ఆడియో లాంచ్ వేడుకని మే 16 న నెహ్రు స్టేడియం లో నిర్వహించే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. అప్పటి నుంచే ఇండియన్ 2 ప్రమోషన్స్ మొదలవుతాయని తెలుస్తోంది. 

Indian 2 audio launch venue fix:

Indian 2: Release date is here!

Tags:   INDIAN 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ