Advertisementt

పవన్ తిట్టాడు అంటున్న పోసాని

Sun 28th Apr 2024 09:41 AM
posani krishna murali  పవన్ తిట్టాడు అంటున్న పోసాని
Posani says Pawan scolded him పవన్ తిట్టాడు అంటున్న పోసాని
Advertisement
Ads by CJ

పోసాని కృష్ణమురళి వైసీపీ లోకి వెళ్ళాక ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాడు, అలాంటి వాడు అని చెబుతూ మీడియా ముందు పవన్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. పవన్ ని తిడితే జగన్ పదవి ఇస్తాను అన్నాడేమో అందుకే పోసాని ఆ మార్గాన్ని ఎంచుకున్నాడంటూ చాలామంది కామెంట్ చేసినవాళ్లు ఉన్నారు. గతంలో పవన్ పై చేసిన వ్యాఖ్యల ఫలితం పోసాని ఇంటిపై రాళ్ళు పడిన సందర్భమూ ఉంది. 

తాజాగా పోసాని కృష్ణమురళీ మరోసారి పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసాడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ గ్రాఫ్ తగ్గించే ప్రయత్నంలో భాగంగా పోసాని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. నాకు రాత్రి షూటింగ్‌లు చెయ్యడం ఇష్టం ఉండదు కానీ.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి రాత్రి షూటింగ్‌కి ఒప్పుకున్నా.. నా భార్య బిడ్డల సాక్షిగా చెప్తున్నా.. షూటింగ్ నుంచి నైట్ ఇంటికి వచ్చేసా అని పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి తిట్టాడు..! అంటూ తెగ ఫీలైపోయాడు. 

మరి పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి పాత్రలు చేసిన పోసాని.. ఇప్పడు రాజకీయ ప్రత్యర్థిగా మారేసరికి.. పోసాని ఇలా మాట్లాడుతున్నాడు. హీరో పవన్ కళ్యాణ్ కి పోసానిని తిట్టాల్సిన అవసరం ఏముంటుంది.. తిడితే గిడితే దర్శకుడు తిడతాడు అంటూ జనసైనికులు పోసానిపై విరుచుకుపడుతున్నారు. 

Posani says Pawan scolded him:

Posani Krishna Murali Comments on Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ