టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్‌తో వారిసు చిత్రాన్ని తెరకెక్కించినప్పుడు.. ఆ చిత్రం సీరియల్‌లా ఉంది అంటూ పలువురు నెటిజెన్స్ వంశీ పైడిపల్లి దర్శకత్వాన్ని దారుణంగా ట్రోల్ చేశారు. ఆ చిత్రం తెలుగు, తమిళ్‌లో అంతో ఇంతో వర్కౌట్ అయ్యింది. కానీ ఓటీటీలో విడుదలయ్యాక వారసుడు చిత్రం చూసి సీరియల్ చూసిన ఫీలింగ్ కలిగింది అంటూ కామెంట్స్ చేశారు.
అప్పట్లో వంశీ పైడిపల్లి ఫేస్ చేసిన కామెంట్స్, ట్రోల్స్‌ని ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ దర్శకుడు పరశురామ్ ఫేస్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండకి గీత గోవిందం లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన పరశురామ్ ఈసారి ఆయనకు ఫ్యామిలి స్టార్‌తో నిరాశని మిగిల్చాడు. ఈ చిత్ర రిజల్ట్ ఎలా ఉన్నా.. విజయ్ దేవరకొండపై నెగిటివిటి వలన బాగా తేడాకొట్టింది.
అయితే థియేటర్స్‌లోనే కాదు రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ నుంచి ఫ్యామిలీ స్టార్ చిత్రం ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఓటీటీలో ఫ్యామిలీ స్టార్‌ని వీక్షించిన చాలామంది ప్రేక్షకులు ఫ్యామిలీ స్టార్ కాదు ఇది సీరియల్ స్టార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాలో చాలా సీన్స్ చూసి పరశురామ్ దర్శకత్వాన్ని ఆడేసుకుంటున్నారు. రవిబాబుకు విజయ్ వార్నింగ్ ఇచ్చే సీన్, విజయ్ పల్చగా దోశ వేసే సీన్, అభినయ లాంటి ఆర్టిస్ట్‌తో కేవలం డైలాగ్ లేని పాత్రకి పరిమితం చెయ్యడం, అమెరికాలోను రొటీన్ స్టోరీ ఉండడం ఇవన్నీ ఫ్యామిలీ స్టార్‌పై ఫ్యామిలీ ఆడియన్స్ చేస్తున్న కంప్లైంట్స్.
థియేటర్స్‌లోనే ఫ్యామిలీ స్టార్ విషయంలో తెగ ట్రోల్ చేసిన ఆడియన్స్, ఓటీటీలోకి వచ్చాక మరింతగా ట్రోల్ చేయడం చూసి.. పాపం అప్పట్లో వంశీ పైడిపల్లి.. ఇప్పుడు పరశురామ్ నెటిజెన్స్ చేతికి దొరికేశారు అంటున్నారు.