ఈమధ్యన చాలామంది స్టార్స్ మల్టీస్టారర్స్‌లో నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో నడుస్తున్నా.. సౌత్ హీరోలకి మల్టీస్టారర్ చేస్తే ఈగో పుట్టుకొస్తుంది. ఒకరి క్యారెక్టర్ ఎక్కువ, మరొకరి క్యారెక్టర్ తక్కువ ఉంటే వాళ్ళు మాత్రమే కాదు అభిమానులు అస్సలు తట్టుకోలేరు. రాజమౌళి లాంటి దర్శకుడే స్టార్ హీరోలైన రామ్ చరణ్‌ని, ఎన్టీఆర్‌ని ఆర్.ఆర్.ఆర్‌లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాకుండా చూపించినా.. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో యుద్ధం నడిచింది.
ఇక ఈ మద్యన నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, హిందీ నుంచి జాకీ ష్రాఫ్ లని తీసుకొచ్చి జైలర్ తీశాడు. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌లు గెస్ట్ రోల్స్ అయినా.. జైలర్ విజయంలో ఆ పాత్రలు కీలకంగా కనిపించాయి.
ఇప్పుడు మరోసారి నెల్సన్ అదే రీతిలో ఆలోచిస్తున్నాడు. ఒకవేళ తాను గనక హీరో విజయ్‌తో సినిమా చేస్తే అందులో మిగతా భాషల స్టార్ హీరోలని ఖచ్చితంగా భాగం చేస్తామని చెప్పడమే కాదు, విజయ్ కోసం టాలీవుడ్ నుంచి మహేష్ బాబుని, బాలీవుడ్ నుంచి షారుఖ్‌ని, మల్లువుడ్ నుంచి మమ్ముట్టిని దించుతానని చెబుతున్నాడు.
మరి విజయ్ కోసం మహేష్ బాబుని, SRKని దించడం అనేది మాములు విషయం కాదు, చూద్దాం విజయ్ ఆఫర్ ఇస్తే నెల్సన్ ఏం మాయ చేస్తాడో అనేది.