పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD ముందుగా లాక్ చేసిన డేట్ మే 9. వైజయంతి మూవీస్ వారు సెంటిమెంట్ డేట్ గా ఫీలవుతూ కల్కి ని రిలీజ్ చేద్దామనుకుంటే.. అనుకోని కష్టం వచ్చి పడినట్లుగా మే 13 న ఇండియా వైడ్ ఎలక్షన్స్ జరగనుండడంతో కల్కి ని వాయిదా వెయ్యక తప్పలేదు.
కానీ కల్కి మూవీ కొత్త రిలీజ్ డేట్ విషయంలో గత నెల రోజులుగా తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది. ప్రభాస్ ఫాన్స్ అయితే కళ్ళల్లో వత్తులు వేసుకుని కల్కి కొత్త తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. కల్కి మేకర్స్ కూడా తొందర పడకుండా కల్కి 2898 AD కొత్త రిలీజ్ డేట్ ని ఎట్టకేలకి ఈరోజు శనివారం 5 గంటలకి వస్తుంది అని ప్రకటించారు.
అనుకున్నట్టుగా కాకుండా ఓ అరగంట ఆలస్యంగా కల్కి తేదీ ప్రకటించారు. జూన్ 27 న కల్కి పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నట్టుగా ప్రకటించారు. ముందు మే 30 న అనుకున్నా అది కుదరక జునే 7 న కొత్త తేదీని ప్రకటించారు. దానితో ప్రభాస్ అభిమానులు ఉత్సాహంగా పండగ చేసుకుంటున్నారు.