టాలీవుడ్‌లో నాగ చైతన్యతో తండేల్ మూవీలో నటిస్తున్న సాయి పల్లవి.. కోలీవుడ్‌లో శివ కార్తీకేయన్ సినిమాలో నటిస్తుంది. తనకిష్టమైన, నచ్చిన పాత్రలని ఏరి కోరి ఎంచుకుంటూ నేచురల్ బ్యూటీగా తన మార్క్ చూపిస్తున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణలో సీత పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, పాన్ ఇండియా స్టార్ యష్ రావణ్‌గా కనిపించనున్న ఈ రామాయణ చిత్రానికి సంబంధించి రీసెంట్‌గా షూటింగ్ మొదలైంది. అసలు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండానే సినిమా షూటింగ్‌ను సైలెంట్ గా మొదలు పెట్టారు. రామాయణ షూటింగ్ మొదలు పెట్టినప్పుడే ఈ చిత్ర సెట్స్ నుంచి కొన్ని ఫొటోస్ లీకై సెన్సేషన్‌ని క్రియేట్ చేశాయి.
ఇప్పుడు మరోసారి రామాయణ బృందానికి షాకిస్తూ ఎవరో షూటింగ్ సెట్‌లో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముల లుక్స్ ఫొటోలను లీక్ చేశారు. ఈ ఫొటోల్లో సీతారాములు కాస్ట్యూమ్స్‌లో సాయిపల్లవి, రణబీర్ కపూర్ ముస్తాబై కనిపించారు. రాముడి గెటప్‌లో ఉన్న రణ్‌బీర్ కపూర్‌పైన ఒక ఫుల్ కోట్ వంటిది వేసుకుని కారావాన్ నుంచి వెళ్తున్నట్టుగా ఉంది.
సీత పాత్రలో సాయి పల్లవి చాలా అందంగా, ముద్దుగా కనిపించింది. దానితో ఆమె అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.