అవును.. నేను అందరిలాగా మోసం చేసి అధికారంలోకి రాను.. రాలేను.! చేసేదే చెబుతా.. అధికారంలోకి వచ్చాక అక్షరాలా మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా పాటిస్తాను. అందుకే కల్లిబొల్లి కబుర్లు చెప్పడం.. వీలుకాని హామీలు ఇవ్వడం నేను చేయట్లేదు. గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా.. హీరోలాగా జనాల్లోకి వెళ్లాను.. ఇవీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు. శనివారం నాడు 2024 ఎన్నికలకు గాను మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేశారు. ఈసారి కూడా కేవలం రెండంటే రెండే పేజీలతో మేనిఫెస్టోను రిలీజ్ చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. 9 హామీలను మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో విద్య, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాలకు నగదు పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిగో 2 పేజీలు, 9 హామీలతో ముఖ్యమైనవి ఇవే..
01. వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు
02. వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంపు
03. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేలకు పెంపు
04. అమ్మ ఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు
05. వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.3 లక్షలు వరకు రుణాలు
06. రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500కు పెంచబోతున్నట్టు ప్రకటన (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం)
07. వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగించనున్నట్టు జగన్ ప్రకటన
08. వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ (ఆరోగ్యశ్రీ పరిధిని ఇదివరకే రూ.25 లక్షలకు విస్తరించాం)
09. వైఎస్సార్ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు
10. మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేత
11. ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ.. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు
12. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా
13. చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు
14. లా నేస్తం కొనసాగింపు
15. అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు
16. నాడు-నేడు.. ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు.. 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్
17. ప్రతీ నియోజకవర్గంలో స్కిల్ హబ్.. జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్ కాలేజీ.. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ