హీరో సిద్దార్థ్-హీరోయిన్ అదితి రావు.. గత నెలలో సీక్రెట్‌గా నిశ్చితార్ధం చేసుకుని అందరికి పెద్ద షాకిచ్చారు. అదితి రావు-సిద్దు లు హైదరాబాద్ వచ్చి ఎవరికీ తెలియకుండా తమిళ బ్రాహ్మణులతో తెలంగాణ గుడిలో చేసుకున్న నిశ్చితార్థాన్ని అందరూ పెళ్లిగా భావించారు. అదే విధంగా సిద్దార్థ్-అదితిలు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు అంటూ మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.
దానితో అదితి తమది సీక్రెట్ వివాహం కాదు కేవలం నిశ్చితార్థమే అంటూ ఫోటో బయటపెట్టింది. సిద్ధు కూడా దానిని సీక్రెట్ అనరు దానిని ప్రైవేట్ వేడుక అంటారు అంటూ కవరింగ్ ఇచ్చాడు. ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యలో చేసుకున్న ఫంక్షన్ అది. అందుకే ప్రైవేట్ ఫంక్షన్ అంటారు. మేము ఎవరికీ చెప్పి చేసుకోలేదు అందుకే వారు సీక్రెట్ అంటున్నారు అంటూ మాట్లాడాడు.
మరి నిశ్చితార్థమేనా.. పెళ్ళి కూడా సీక్రెటేనా సిద్దు అంటూ చాలామంది అప్పటి నుంచి కామెంట్ చేస్తున్నారు. కాని సిద్ధు-అదితిలు పెళ్లి తేదీపై కానీ, అది జరిగే వేదిక విషయం కానీ బయటపెట్టలేదు. అందుకే ఇప్పటికీ చాలామంది నిశ్చితార్థాన్ని సీక్రెట్‌గా చేసుకున్నట్లే పెళ్ళి కూడా సీక్రెట్‌గా చేసేసుకుంటారేమో అంటున్నారు. ఏం.. అలా చేసేసుకుని.. ఇది కూడా బంధువుల మధ్యలో చేసుకున్నాం.. సీక్రెట్ ఏం లేదని అంటారామో.. చూడాలి. కాగా.. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం.