Advertisementt

పవన్ పాలిటిక్స్‌పై.. మహేష్ సోదరి

Sat 27th Apr 2024 04:25 PM
pawan kalyan manjula  పవన్ పాలిటిక్స్‌పై.. మహేష్ సోదరి
Mahesh Babu Sister Manjula Comments on Pawan Kalyan Politics పవన్ పాలిటిక్స్‌పై.. మహేష్ సోదరి
Advertisement
Ads by CJ

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల మాట్లాడుతోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుండటం విశేషం. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ కృష్ణని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే. కాంట్రవర్సీ‌గా చూడాల్సిన వ్యాఖ్యలు కాకపోయినప్పటికీ.. కొందరు వైసీపీ బ్యాచ్.. ఆ వ్యాఖ్యలను నెగిటివ్‌గా ప్రొజెక్ట్ చేయాలని చూడటంతో.. విజయ నిర్మల కుమారుడు నరేష్ కూడా ఆ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు.

ప్రతిపక్షాన్ని, తనని ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్ ఇబ్బంది పెట్టారో చెప్పారో ప్రయత్నంలో ఎన్టీఆర్-కృష్ణల ప్రస్తావనను పవన్ కళ్యాణ్ తెచ్చారు. దానిని క్యాష్ చేసుకోవాలని వైసీపీ చేసిన ప్రయత్నాన్ని జనసైనికులు ఆదిలోనే తుంచేశారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ చెప్పిన అవే మాటలు.. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా చెప్పి ఉండటంతో వైసీపీ పాచిక పారలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌‌పై మాట్లాడుతోన్న వీడియో వైరల్ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇంతకీ మంజుల ఏం అన్నారంటే.. పవన్ కళ్యాణ్‌తో నాకంతగా పరిచయం లేదు కానీ.. ఇప్పుడున్న స్టార్‌డమ్‌లో ఆయనకు రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ప్రజాసేవ చేయాలని ఆయనకు మనసులో కలిగింది. అలా మనసు చెప్పింది చేసే వారంటే నాకు ఎంతో ఇష్టం. సినిమాల్లోనే కాకుండా.. రాజకీయంగానూ ఆయన ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన వేసే ప్రతి అడుగు విజయం వైపు వెళ్లాలని కోరుకుంటున్నాను.. అని మంజుల చెబుతున్న వీడియోని జనసైనికులు వైరల్ చేస్తున్నారు. కృష్ణగారి కుమార్తె, మహేష్ బాబు సోదరే పవన్ కళ్యాణ్ గురించి అలా చెబుతున్నారంటే.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఇకనైనా అర్థం చేసుకోవాలంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Mahesh Babu Sister Manjula Comments on Pawan Kalyan Politics:

Manjula wants Pawan Kalyan Victory

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ