హీరోయిన్ సమంత.. నాగ చైతన్య ని వివాహం చేసుకుని అక్కినేని ఫ్యామిలోకి ఎంటర్ అయ్యింది. ప్రేమ పెళ్లి అయినా పెద్దలు ఒప్పుకోవడంతో సమంత-నాగ చైతన్య లు గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిష్టియన్ సంప్రదాయాల్లో సమంత-నాగ చైతన్యాల వివాహం జరిగింది. హిందూ పెళ్ళిలో సమంత రామానాయుడి గారి భార్య చీరని రీ డిజైన్ చేయించుకుని ధరించింది.
ఇక క్రిష్టియన్ సంప్రదాయంలో సమంత వైట్ గౌన్ లో వివాహం చేసుకుంది. ఆ గౌన్ ని సమంత పదిలంగా దాచుకుంది. చైతూతో విభేదాల వలన విడిపోయినా.. సమంత మాత్రం పెళ్లి గౌన్ ని భద్రపరుచుకుంది. ఇప్పుడు ఆ పెళ్లి గౌన్ ని కూడా రీ మోడలింగ్ చేయించుకునిఓ అవార్డు ఫంక్షన్ కోసం ధరించింది. తన వైట్ కలర్ పెళ్లి గౌనుని బ్లాక్ కలర్ కి మార్చి కొత్తగా డిజైన్ చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సమంత పెళ్లి డ్రెస్ ని క్రేశ బజాజ్ అనే సంస్థ రీ మోడలింగ్ చేసింది. సమంతతో కలిసి పెళ్లి గౌనుని రీమోడలింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి.. కొత్త జ్ఞాపకాలు, నడవడానికి కొత్త దారులు, చెప్పడానికి కొత్త కథలు ఎప్పుడూ ఉంటాయి. సమంతతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. ఆమెకు ఒక కొత్త జ్ఞాపకాన్ని సృష్టించాము అని పోస్ట్ చేశారు.
సమంత కూడా తన పెళ్ళినాటి రీ మోడలింగ్ గౌన్ తో సరికొత్తగా ఫొటోలకి ఫోజులిచ్చింది.