సౌత్ లో హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేద్దామని కలలు కన్న మృణాల్ ఠాకూర్ కి ఫ్యామిలీ స్టార్ చిన్నపాటి ఝలక్ ఇచ్చింది. సీతారామం, హాయ్ నాన్న సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. ప్రస్తుతం సౌత్ లో ఒకటో రెండో ప్రాజెక్ట్స్ చేస్తున్న మృణాల్ ఠాకూర్ తాజాగా షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా చెప్పింది.
హ్యుమన్స్ ఆఫ్ బాంబే చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ పర్సనల్ విషయాలపై సన్సేషనల్ కామెంట్స్ చేసింది. కెరీర్‌ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చెయ్యడం చాలా కష్టం. కానీ మనం ఎప్పుడు దానిని ఎలా మ్యానేజ్ చెయ్యాలో అని ఆలోచిస్తూనే ఉంటాము, ఇక సరైన భాగస్వామి దొరకాలన్నా కష్టమే. రిలేషన్‌షిప్ మైంటైన్ చెయ్యడము కష్టమే. అందుకే నేను ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నాను’ అంటూ చెప్పి షాకిచ్చింది.
మరి మృణాల్ ఠాకూర్ కెరీర్ అలాగే పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ అందులో ముఖ్యంగా కెరీర్‌పై ఎక్కువగా ఫోకస్ చెయ్యాలనుకుంటుంది అనేది ఆమె ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పేసింది.