ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. వై నాట్ 175 అంటున్న వైసీపీ గెలుస్తుందా.. జండాలు జత కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది అతి త్వరలోనే తేలిపోనుంది. దీంతో ఇదిగో కూటమి గెలిస్తే పలానా వ్యక్తి.. వైసీపీ గెలిస్తే అదిగో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని లెక్కలేసుకుంటున్నారు. అంతే కాదండోయ్ శాఖలు సైతం పంచుకుంటున్న పరిస్థితి. ఈ లెక్కలోకి ఎవరెవరు వస్తారు.. ఈ మధ్య మీడియా ముందు, ఇంటర్వ్యూల్లో హడావుడి చేస్తున్న నేతల గురుంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
గెలిస్తే మంత్రి..!
ఇవన్నీ అటుంచితే ఒక నియోజకవర్గంలో గెలిస్తే.. ఆ ఎమ్మెల్యే పోటీ చేసిన పార్టీ అధికారంలోకి వస్తే చాలు మంత్రి పదవి గ్యారెంటీ.. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి అని తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా.. ఇంకెందుకు ఆలస్యం WWW.Cinejosh.Com స్పెషల్ ఆర్టికల్ చదివేయండి మరి. ఆ
నియోజకవర్గం మరేదో కాదండోయ్ బాపట్ల జిల్లా వేమూరు. ఇది
రిజర్వ్‌డ్ నియోజకవర్గం. 1955 నుంచి ఇప్పటి వరకూ 15 సార్లు ఎన్నికలు జరగగా.. 8 మంది మంత్రి పదవులు దక్కించుకోవడం విశేషం. ఇందులో కల్లూరి చంద్రమౌళి (1955-56,1960-62),
యడ్లపాటి వెంకట్రావు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన ఈయన
1978–1980 లో మంత్రిగా పని చేశారు.నాదెండ్ల భాస్కరరావు (1983), ఆలపాటి ధర్మారావు (1989), ఆలపాటి రాజేంద్రప్రసాద్
1999 నుంచి నవంబర్ 26, 2001 వరకూ చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. సతీశ్ పాల్ రాజ్
(2004), నక్కా ఆనందబాబు (2017-2019), మేరుగ నాగార్జున వైసీపీ తరపున గెలిచి సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.
ఈసారి మంత్రి యోగం ఎవరికో..?
ఈసారి వైసీపీ తరపున వరికూటి అశోక్ బాబు బరిలో ఉండగా.. టీడీపీ తరపున రెండు సార్లు గెలిచిన సీనియర్ నక్కా ఆనంద బాబు పోటీ చేస్తున్నారు. అశోక్ బాబుకు ఈ నియోజకవర్గం కొత్తే అయినా కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నక్కా ఐతే రెండుసార్లు గెలిచిన తనకు ఈ ఎన్నిక అసలు లెక్కే కాదని గెలుస్తానని.. కూటమి కూడా గెలుస్తుందని మంత్రి పదవి పక్క అని పరోక్షంగా చెబుతున్నారు. మరి కూటమి గెలిచి నక్కాను మంత్రిని చేస్తుందా.. లేకుంటే వైసీపీ గెలిచాక వరికూటిని పదవి వరిస్తుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఐతే ఇన్ని రోజులుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.