బుట్టబొమ్మగా సౌత్ ప్రేక్షకుల మనసులని తాకిన పూజ హెగ్డే టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో నటించి నెంబర్ 1 స్థానాన్ని చేరుకుంటుంది అనుకునేలోపు రష్మిక రూపంలో ఆమెకి కాంపిటీషన్ తగిలింది. రశ్మికతో పోటీ పడుతూనే స్టార్ హీరోల సినిమాల్లో, భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీస్ లో నటించిన పూజ హెగ్డేని వరుస వైఫల్యాలు బాగా ఇబ్బంది పెట్టేశాయి.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ నిరాశపరిచే సినిమాలు పూజ హెగ్డేని కెరీర్ లో కిందకి నెట్టేశాయి. ప్రస్తుతం సౌత్ ఆఫర్స్ సన్నగిల్లినా ఆమెని మాతృ భాష హిందీ ఆదుకుంటుంది. అక్కడ రెండు మూడు ప్రాజెక్ట్స్ కి సైన్ చెయ్యడమే కాకుండా షూటింగ్ కి హాజరవుతుంది. సినిమాలు ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో ఈ తార ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది.
తరచూ తన ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకి కనువిందు చేస్తుంది. తాజాగా పూజ హెగ్డే సూపర్ ట్రెడిషనల్ గా బ్యూటిఫుల్ గా ఉన్న పిక్స్ వదిలింది. Perfectly imperfect ❤️ అంటూ పూజ హెగ్డే తన పిక్స్ కి క్యాప్షన్ పెట్టగా ఆమె అభిమానులు పూజ హెగ్డే లేటెస్ట్‌లుని లైక్స్ కొడుతూ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.