అవును.. జనసేన కార్యకర్తలు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమానులు, మెగాభిమానులకు ఇది నిజంగా ముఖ్య గమనికే. ఈ విషయం తెలుసుకున్నాక మీరొక పదిమందికి చెప్పండి.. ఆ పదిమందిని ఒక్కొక్కరు పదిమందికి చెబితే ఇక మీకు ఏ మీడియా, సోషల్ మీడియా అస్సలు అక్కర్లేదండోయ్. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం వచ్చేయండి. పవన్ కల్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురంలో అధికార వైసీపీ ఎన్నెన్ని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసెంబ్లీలోకి అడుగుపెడతానని పవన్.. గేటు కూడా తాకనీయమని, ఆడ మనిషి చేతిలో ఓడిస్తామని వైసీపీ పక్కా వ్యూహంతో ముందకెళ్తోంది. ఇందులో భాగంగా చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ పోతోంది. అధికారం చేతిలో ఉండటంతో అంతా మా ఇష్టం.. మేం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. అడ్డొచ్చేదెవరు..? అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తన ఉంది.
తెలుసుకోండి.. తెలియజేయండి!
పిఠాపురంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో.. కోనేటి పవన్ కల్యాణ్, కనుమూరి పవన్ కల్యాణ్ అనే ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో, మౌత్ పబ్లిసిటీ గట్టిగానే జరుగుతోంది. అంతేకాదు.. బ్యాలెట్ పేపర్‌ను కూడా తయారుచేసి ముగ్గురి పేర్లు, పక్కనే గుర్తులను ముద్రించి మరీ పవన్ అంటే పడని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. ఇది నియోజకవర్గ ప్రజలను, జనసేన కార్యకర్తలనే గందరగోళంలో నెట్టేస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజం..? ఇందులో నిజానిజాలెంత అని WWW. Cinejosh.Com ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఎన్నికల కమిషన్‌లో ఉన్న వివరాల ప్రకారం పవన్ కల్యాణ్ పేరుతో ఒక్కరే అది కూడా జనసేన అధినేత మాత్రమే పోటీలో ఉన్నారని తేలింది. అయితే ఈ నియోజకవర్గంలో మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైసీపీ, కాంగ్రెస్.. ఇతర పార్టీలు, స్వతంత్రులు ఉన్నారు. అంతేకానీ ఎవరూ పవన్ పేరిట లేరన్నది జనసైనికులు తెలుసుకోవాలి.. పది మందికి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది.
ఊపిరి పీల్చుకో.. సేన!
వాస్తవానికి మొదట్నుంచీ పిఠాపురం విషయంలో జనసైనికుల్లో ఎన్నో టెన్షన్.. అంతకుమించి ఆందోళనలు ఉండేవి. పార్టీ గుర్తు, పవన్ పేరిట ఎక్కువ మంది నామినేషన్లు వేసే ఛాన్స్ ఉందని, గుర్తుల విషయంలో గందరగోళమే ఉన్నది. అయితే.. నామినేషన్లు ముగిసే సరికి ఇంతవరకూ పవన్ పేరిట ఒక్కరే ఉండగా.. గుర్తు కూడా గాజు గ్లాస్ మాత్రమే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ పవన్‌పై లేనిపోని దుష్ప్రచారం చేసిన వైసీపీ.. పవన్ వ్యతిరేకులు తాజాగా ఈసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం జనసైనికులు ఊపిరిపీల్చుకోవచ్చన్న మాట. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పిఠాపురం ప్రజలకు తెలియజేస్తారో.. లేకుంటే పిఠాపురంలో ఉన్న కార్యకర్తలు, వీరాభిమానుల ద్వారా ప్రచారం చేసుకుంటారో ఇక మీ ఇష్టం. పవన్ కోసం పనిచేసే నిజమైన కార్యకర్తలు.. ఈ విషయాలను జనాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా మీపైన ఉంది.. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పట్నుంచే షురూ చేసేయండి మరి.