ఓ మై గాడ్ బాలీవుడ్ సినిమా భారీ విజయం సాధించడంతో.. ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఓ మై గాడ్ 2 ఇటీవల విడుదలై కాంట్రవర్సీ అవుతూ.. మంచి విజయాన్నే నమోదు చేసింది. ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్‌లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఓ మై గాడ్ 2 ఓటీటీలోకి ఎప్పుడో వచ్చింది. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే ఇప్పటి వరకు ఓటీటీలో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓటీటీలోకి తీసుకొచ్చింది.
ఓ మై గాడ్ 2 హిందీ వెర్షన్ ఓటీటీలోకి వచ్చిన 9 నెలల అనంతరం తెలుగు వెర్షన్ ఓటీటీలోకి రావడం విశేషం. 2023 ఆగస్ట్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. దాదాపు రూ. 200 కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే ఓటీటీలో వచ్చిన హిందీ వెర్షన్ కూడా మంచి ఆదరణనే రాబట్టుకుంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా సక్సెస్ అవుతుందని సదరు ఓటీటీ సంస్థ భావిస్తోంది. చూడాలి.. తెలుగు వెర్షన్ ఎలాంటి ఆదరణను పొందుతుందో. అంతకుముందు వచ్చిన ఓ మై గాడ్ మూవీ తెలుగులో గోపాల గోపాల పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కీలక పాత్రలలో నటించారు.
ఓ మై గాడ్ 2లో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించారు. ఆయనలా కనిపించడంపై అప్పట్లో కాంట్రవర్సీ కూడా అయింది. కొందరు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. అక్షయ్ కుమార్ పాత్ర పేరుని మార్చాల్సిన పరిస్థితి నెలకొంది.