Advertisementt

పుష్ప పుష్ప.. హమ్మింగ్ మొదలైంది

Thu 25th Apr 2024 11:54 AM
pushpa pushpa promo  పుష్ప పుష్ప.. హమ్మింగ్ మొదలైంది
Pushpa 2 The Rule First Single Promo పుష్ప పుష్ప.. హమ్మింగ్ మొదలైంది
Advertisement
Ads by CJ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పుష్ప 2 ది రూల్ నుంచి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమోతో పాటు ఫుల్ సాంగ్‌ని మే 1న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. 

పుష్ప విజయానికి అల్లు అర్జున్ నటన, సుకుమార్ డైరెక్షన్‌తో పాటు చంద్రబోస్ పాటలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన హైలెట్స్‌గా నిలిచాయి. పుష్పలోని ప్రతి పాట ప్రేక్షకులని ఆకర్షించింది. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ ఆల్బమ్ పుష్పని మించి ఉంటుందనేలా.. తాజాగా వచ్చిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఈ ప్రోమో ఎంత గ్రాండ్‌గా ఉందంటే.. అప్పుడే అందరూ ఈ పాటను హమ్మింగ్ చేసేంతగా. 

పుష్ప టైటిల్ సాంగ్‌గా రాబోతోన్న ఈ పాట.. సంచలనాలను క్రియేట్ చేయడం పక్కా అనేలా మేకర్స్ చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ ఆల్బమ్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుని.. మరోసారి తన సత్తా ఏంటో చూపించబోతున్నాడనేలా.. అప్పుడే ఫ్యాన్స్ కామెంట్స్ స్టార్ట్ చేశారు. మే 1న మాస్ జాతర షురూ అంటూ వారు చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం ఈ ప్రోమోని టాప్‌లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి.

Pushpa 2 The Rule First Single Promo:

Promo Of Pushpa 2 The Rule First Single PUSHPA PUSHPA Is Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ