Advertisementt

పవన్‌ని తిడితే ప్యాకేజ్ ఎంతొచ్చింది?

Thu 25th Apr 2024 09:00 AM
pothina mahesh  పవన్‌ని తిడితే ప్యాకేజ్ ఎంతొచ్చింది?
Package Star Pothina Mahesh Fires on Pawan Kalyan పవన్‌ని తిడితే ప్యాకేజ్ ఎంతొచ్చింది?
Advertisement
Ads by CJ

పోతిన మహేష్ విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలవడం కాదు.. జనసేన పార్టీ తరపున టికెట్ రాని కారణంగా ఇమ్మీడియేట్‌గా వైసీపీలోకి వెళ్లి జగన్ చేత కండువా కప్పించుకున్నాడు. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ని పోతిన మహేష్ తిట్టడం తప్ప మరేది చేయడం లేదు. సీఎం జగన్‌తో పాటు‌గా మహేష్ పోతిన కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కామెంట్స్ చేస్తున్నాడు. 

పవన్ కళ్యాణ్ నీ దగ్గర పని చేసిన ఒక్కరైనా బాగుపడ్డారా.. అదే అల్లు అర్జున్ దగ్గర పని చేసే ప్రతోడు బాగుపడ్డాడు, నీ స్వార్ధం మాత్రమే నువ్వు చూసుకుంటావ్.. ఎవ్వరిని పట్టించుకోవు అంటూ పవన్ కళ్యాణ్‌ని ఎడా పెడా తగులుకుంటున్నాడు. కానీ మిగతా విషయాలేవీ మాట్లాడటం లేదు. తన రాజకీయ ప్రత్యర్థి కేవలం పవన్ అన్నట్టుగా మహేష్ ప్రవర్తిస్తున్నాడు. 

ఇది చూసిన చాలామంది ఏంటి మహేష్ పవన్‌ని తిట్టడానికి, అతన్ని విమర్శించడానికి నువ్వు వైసీపీ నుంచి ఎంత ప్యాకేజ్ అందుకున్నావ్, ఎంతిచ్చారేమిటి నీకు పవన్ కళ్యాణ్‌ని తిట్టేందుకు అంటూ నెటిజన్లు ఒకటే కామెంట్స్. ఎందుకంటే నిన్నగాక మొన్నటి వరకు పవనే నా దేవుడు అనుకున్న వ్యక్తి.. ఈ రోజు ఇలా విమర్శిస్తున్నాడంటే.. ప్యాకేజ్ మహత్యమే అని అంతా అనుకుంటుండటం గమనార్హం.

Package Star Pothina Mahesh Fires on Pawan Kalyan:

Pothina Mahesh Comments on Pawan Kalyan

Tags:   POTHINA MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ